Posted [relativedate]
ప్రధాని మోడీ పేరు చెప్పగానే వైసీపీ గొంతు పెగలడం లేదు …గొంతు పెగిలినా నాలుక మడత పడుతోంది .వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తాజా ప్రెస్ మీట్ అందుకు సజీవ సాక్ష్యం .విశాఖ జై ఆంధ్ర ప్రదేశ్ సభ గురించి మాట్లాడుతూ దేశం నేతలు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగాలని జగన్ కి సవాల్ విసిరారు. దాన్ని అందిపుచ్చుకున్న భూమన…మోడీని తిట్టమని అడుగుతున్నారా అంటూ దేశం మీదకి రివర్స్ ఎటాక్ చేశారు.అంతటితో ఆగకుండా దేశం నాయకులు మోడీని తిట్టమంటున్నారు చూడండి అంటూ బీజేపీ ని కూడా అలెర్ట్ చేశారు.
సరే ఇదంతా నిజమేమో మోడీని వైసీపీ తిట్టదలుచుకోలేదేమో అనుకుంటే అదే ప్రెస్ మీట్ లో ఏపీ కి ప్రత్యేక హోదా కోసం జగన్ ఎవరితో అయినా పోరాడతారని …మోడీ కూడా మినహాయింపు కాదని చెప్పారు.ఈ విషయాన్ని జగన్ జై ఆంధ్ర ప్రదేశ్ సభలో స్పష్టంగా చెప్పారట. అదే నిజమైతే జగన్ ప్రసంగం విన్న వాళ్లంతా చెవిటివాళ్ళా? ఒక్క పత్రికైనా చివరికి సాక్షితో సహా జగన్ ప్రసంగాన్ని రిపోర్ట్ చేసిన కథనాల్లో మోడీ పేరు రాసిందా? అయినా జనాన్ని నమ్మిద్దామని జగన్ కి లేని ధైర్యాన్ని ఆపాదిస్తూ భూమన ఎంత ప్రయత్నించి లాభమేంటి? ఒక్కసారి మీ ప్రెస్ మీట్ వీడియో,జగన్ ప్రసంగం వీడియో చూసుకుని మాట్లాడండి భూమనగారు..జనం మరీ అంత పిచ్చివాళ్ళేమీ కాదు..