ఇది ముక్కోణపు ప్రేమకధ..వైసీపీ ఆరోపణ

175
Spread the love

ycp triangle love story
రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వ్యవహారంలో ఒక్కో పార్టీ ఒక్కో వాదన వినిపిస్తున్నాయి .తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా సరికొత్త ఆరోపణ చేశారు.బిల్లు చర్చకు రాకుండా కాంగ్రెస్ సభ్యులే గొడవ చేశారని ఆయన ఆరోపించారు.పని కాకుండా ప్రచారం అన్నదే ఆ పార్టీ లక్ష్యమని విజయ సాయి అంటున్నారు .అంతకు మించిన బాంబ్ కూడా ఆయన ఇంకోటి పేల్చారు .అది ..బీజేపీ ,కాంగ్రెస్ ,టీడీపీ ..ఈ మూడు పార్టీలు కూడబలుక్కొని బిల్లుపై కుట్ర చేశాయట .

అయితే ఈ ముక్కోణపు ప్రేమకథ ని ఎవరు డైరెక్ట్ చేశారో మాత్రం ఆయన చెప్పలేదు .ఎవరెన్ని కుట్రలు చేసినా కోర్టుకు వెళ్లి అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన చెప్పారు.విభజన సమయం లో ఉండవల్లి కూడా ఇలా కోర్టు మాట తెగ వాడారు .ప్రజలకు లేనిపోని ఆశలు రేపారు ..ఇప్పుడు విజయ సాయి వంతు ..చూద్దాం ..ఈయన ఎంతవరకు వెళతారో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here