Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ తెలుగులో నటించిన ‘సరైనోడు’ చిత్రం అదే టైటిల్‌తో హిందీలో డబ్ అయ్యింది. బుల్లి తెరపై సందడి చేసి, ఆ వెంటనే ఆన్ లైన్లో యూట్యూబ్‌లో ఎక్కింది. సంచలన రీతిలో ‘సరైనోడు’ హిందీ వర్షన్ భారీ వస్యూస్ను సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకోవడం ఏంటని బాలీవుడ్ వర్గాల వారు కూడా షాక్ అయ్యారు. విదేశాల్లో కూడా కూడా ‘సరైనోడు’ చిత్రం ట్రెండ్ అయ్యింది అంటే బన్నీ స్థాయి ఏ రేంజ్లో ఉందో చెప్పుకోవచ్చు. ఇప్పుడు బన్నీ కొత్త సినిమా ‘డీజే’ కూడా దుమ్ము రేపుతూ యూట్యూబ్‌లో సంచలన వ్యూస్‌ను సాధిస్తుంది.
బాలీవుడ్ సినిమాలకు పోటీగా ‘డీజే’ చిత్రం కేవలం 48 గంటల్లో 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో వ్యూస్‌ను సౌత్ ఇండియా నుండి దక్కించుకున్న ట్రైలర్‌గా ‘డీజే’ చరిత్ర సృష్టించింది. అద్బుతమైన రెస్సాన్స్‌కు చిత్ర యూనిట్ సభ్యులు కూడా అవాక్కవుతున్నారు. అందుకే చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ను సోషల్ మీడియా కింగ్ అంటూ అభివర్ణిస్తున్నారు. బన్నీ ఈ బిరుదుకు మురిసి పోతున్నాడు. ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న స్టార్‌గా కూడా బన్నీ పేరు దక్కించుకున్నాడు. అందుకే మేం కూడా బన్నీని సోషల్ మీడియా కింగ్‌గా ఒప్పుకుంటున్నాం.
