Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సన్యాసి అంటే సత్రం భోజనం.. మఠం నిద్ర కామన్. గోరఖ్ పూర్ మఠం నడుపుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఈ విషయం బాగా అలవాటే. కానీ సీఎం అయ్యాక కూడా పాత అలవాట్లు మానుకోలేకపోతున్నారట. ఇకపై తాను కిందే కూర్చుంటానని సీఎం చెప్పడంతో అధికారులు షాకవుతున్నారు.
సీఎం ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని, విలాసవంతమైన సదుపాయాలు ఉంటున్నాయని విపక్షాలు విమర్శించడంతో.. యోగి ఈ సంచలన నిర్ణం తీసుకున్నారు. ఇటీవల అమరుడైన ఓ బీఎస్ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించడానికి యోగి వెళితే.. సోఫా, కార్పెట్ అప్పటికప్పుడు ఏర్పాటుచేయడం విమర్శలకు దారితీసింది.
దీంతో అధికారులపై సీరియస్ అయిన యోగి.. ఇకపై సీఎం కోసం ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను కిందే కూర్చుంటానని, విలాసవంతమైన జీవనశైలికి చాలా దూరమని తేల్చిచెప్పారు. తామేదో యోగిపై విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటే.. ఈయన ఎదురు షాకిచ్చాడని విపక్షాలు వాపోతున్నాయి.