Posted [relativedate]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఎంతోమంది దర్శకులతో చర్చలు జరిపి ఫైనల్ గా పవర్ డైరక్టర్ బాబితో ఫిక్స్ అయ్యాడు. పవర్ తో డైరక్టర్ గా మారిన బాబి ఆ తర్వాత పవర్ స్టార్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసినా అది ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథతో జూనియర్ ను ఇంప్రెస్ చేశాడు. అయితే తారక్ బాబి కథకు అంతగా ఇంప్రెస్ అవడానికి కారణం సినిమాలో హీరో డ్యుయల్ రోల్ అవడమేనట.
పవర్ లో కూడా ఒకే క్యారక్టర్ ను రెండు పాత్రలుగా సృష్టించి హిట్ అందుకున్న బాబి అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా డబుల్ కిక్ ఇవ్వబోతున్నాడట. అంతేకాదు అదుర్స్ దగ్గర నుండి తారక్ కు డ్యుయల్ రోల్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే బాబి కథను ఫైనల్ చేశాడట. కళ్యాణ్ రాం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారట.
సో గ్యారేజ్ తర్వాత సినిమా ఫైనల్ అవడమే కాకుండా తమ అభిమాన నటుడు డ్యుయల్ రోల్ లో చేస్తాడని తెలిసి తారక్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహంలో ఉన్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాల గురించి ఓ క్లారిటీ రానుంది.