వై.ఎస్ నమ్మిన బంటు తల బద్దలు

Posted February 14, 2017

ys follower sureedu got head injury
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఏ మాత్రం తెలిసిన వారికైనా ఆయన నమ్మినబంటు సూరీడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ఆయన్ని దగ్గరకు రానిచ్చిన దాఖలాలు లేవు.దానికి కారణమేంటి అన్నది ఇప్పటిదాకా బయటకు రాలేదు.కానీ సూరీడు వై.ఎస్ కి అంత దగ్గర ఎలా అయ్యాడో తెలిసిపోయింది.అప్పట్లో వై.ఎస్ పులివెందులలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు.ఓ రోజు ఆయన,తన మిత్రుడు సాయిప్రతాప్(రాజంపేట మాజీ ఎంపీ ) తో కూర్చొని ఏదో విషయం చర్చిస్తున్నారు.ఇంతలో నల్లగా,లావుగా వున్న ఓ యువకుడు అక్కడికి వచ్చాడు.

ఆ కుర్రోడిని చూసిన వై.ఎస్ సంభాషణ ఆపి ఏమి కావాలని అడిగాడు.దానికి జవాబుగా మీ దగ్గర బాడీ గార్డ్ గా చేరదామని వచ్చా అన్నది ఆ యువకుడి ఆన్సర్.వై .ఎస్ బదులివ్వకుండా తన పనిలో పడినా ఆ కుర్రోడు అక్కడనుంచి కదల్లేదు.ఎలా అతడిని అక్కడనుంచి పంపించాలా అని ఆలోచించి కాస్త దూరంగా వున్న ఇంటి గోడని చూపించి ..పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గోడని డీకొడితే బాడీ గార్డ్ గా పెట్టుకుంటామని వై.ఎస్ సరదాగా అన్నాడు.కానీ ఆ కుర్రోడు దాన్ని సీరియస్ గానే తీసుకున్నాడు.ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గోడని ఢీకొట్టాడు.ఏముంది …తల పగిలి రక్తం ధారలు కట్టింది.అంతే వై.ఎస్,సాయి ప్రతాప్ కంగారు పడిపోయారు.వెంటనే ఆ కుర్రోడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేశారు వై.ఎస్.ఆ తర్వాత అతన్ని బాడీ గార్డ్ గా పెట్టుకున్నారు.ఆ కుర్రోడే సూరీడు.దాదాపు మూడు దశాబ్దాల పాటు వై.ఎస్ తోడునీడగా మెలిగినవాడు.అందుకే తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ సారి సూరీడు మీద అవినీతి ఆరోపణలు వచ్చినా వై .ఎస్ అతని మీద ఈగ వాలనివ్వలేదు.

SHARE