వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన వైఖరిని మార్చుకొంటున్నారా? తండ్రి ఆప్తమిత్రులకు జగన్ దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తున్నారా…? అంటే ఔననే సమాధానమే వస్తోంది… ఉండవల్లి అరుణ్ కుమార్‌ను జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామ ర్శించారు. ఇప్పుడు అదే ఉండవల్లి అరుణ్‌కుమార్ టిడిపి సర్కా ర్‌పై విమర్శనాస్త్రాలు సంథిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజకీయ పయనం ఎటువైపు అన్న దిశగా రాజకీయవర్గాల్లో చర్చసాగుతోంది ఉండవల్లికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాళంవేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే ఉండటంతో ఉండవల్లి అరుణ్‌కుమార్ సైతం తన రాజకీయభవిష్యత్తుకోసం బలమైన పార్టీవైపే మొగ్గుచూపుతారని అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు ఆయన సన్నిహితులు వ్యాఖ్యనిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకంటూ ప్రత్యేకంగా ఏర్పరుచుకొన్న అనచరగణం బలంతో పార్టీని ఏర్పాటుచేసిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన తండ్రికి కీలక మిత్రులుగా వ్యవహరించిన వారిని దగ్గరచేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శ ఉంది. ఇప్పుడిప్పుడే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరిణితితో వ్యవహరిస్తున్నారని, అందర్నీ కలుపుకొనిపోయే స్వభావాన్ని ఆయన అలవర్చుకొంటున్నారని జగన్‌కు సన్నిహితంగా ఉండే వైసిపి ముఖ్యనేత ఒకరు పేర్కొంటున్నారు.
రాజకీయాలలో శాశ్వతమిత్రలు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది జగన్ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని ఆయన చెబుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన నేతలంతా జగన్‌కు అండగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ఈ నేతలు కొందరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సందర్భంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఒకప్పుడు కుడి, ఎడమ భుజంగా, అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు మాత్రం జగన్‌కు దూరమయ్యారు. ఈ లోటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పెద్ద ప్రభావమే చూపిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రాజకీయాలలో ఓ ప్రభంజనంలా దూసుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పరాభావంను ఎదు ర్కొంది. ఈ ఓటమికి అనేక కారణాలున్నా వై.ఎస్.జగన్ వ్యక్తిగత ధోరణీ కూడా కొంత కారణమని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తాయి.
జగన్‌ను రాజకీయంగా ముందుకు నడిపే పట్టిష్టమైన అనచరగణం లేకపోవడం తనమాటే అందరూ వినాలన్న ఏకపక్ష ధోరణీ కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఓ కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పేర్కొన్నారు. వై.ఎస్. సిఎంగా ఉన్న సమయంలో ఆయనకు పాలనపరంగా, ప్రతిపక్షాలపై ఎదురుదాడిచేసే విషయంలో కొంతమంది ముఖ్యసన్నిహితులు ఉండేవారు. తెరవెనకవుండి వై.ఎస్.హయాంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను, పాలనాపరమైన వ్యవహారాళ్లను చక్కబెట్టడంలో కెవిపి రామచంద్రరావు కీలకపాత్ర .అదే సందర్భంలో ప్రత్యర్థిరాజకీయ పార్టీలపై దుమ్మెత్తిపోసి ఎదురు దాడి చేసి వై.ఎస్.ప్రభుత్వానికి అండగా నిలిచిన మరో కీలక వ్యక్తి ఉండవల్లి అరుణ్‌కుమార్. ఇక వై.ఎస్.కు నాడు తన మంత్రివర్గంలో కీలకంగావ్యవహరించిన వారిలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మంత్రులు ఉండేవారు. కానీ వై.ఎస్.మరణానంతరం ఆయన అభిమానులు జగన్‌కు అండగా నిలిచినా వై.ఎస్.కు అత్యంత అప్తులుగా వారు మాత్రం కాస్త దూరాన్ని పాటించారు.
వై.ఎస్.మరణానంతం ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వై.ఎస్.పైనా ఎదురుదాడి చేశారు. దీంతో నాడు వై.ఎస్.జగన్మోహ న్‌రెడ్డికి బొత్స సత్యనారాయణకు మధ్య వైరం ఎంతో పెరిగిందన్న ప్రచారం కూడా సాగింది. రాష్ట్రవిభజన తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ తరువాత బిజెపిలో చేరుతున్నారు అన్న ప్రచారం సాగింది. కానీ కొందరు సన్నిహితుల సూచన మేరకు పాత విషయాలను పక్కనెట్టి బొత్స సత్యనారాయణను జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక ధర్మాన బ్రదర్స్ పాత్ర కీలకమన్న ప్రచారం కూడా ఉంది. ఇలా తన తండ్రికి అత్యంత ఆప్తులుగా ఉండి ఆయనకు అండదండలు అందించిన నేతలకు జగన్ దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.