Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ నివాస భవనం లోటస్ పాండ్ ఖాళీ అవుతుందా? జగన్ స్వయంగా ఆ నిర్ణయం తీసుకుంటారా? ఏమో చెప్పలేము. ఏమైనా జరగొచ్చు.ఎందుకంటే అక్కడ ఉన్నంత కాలం అధికారం ఆయనకి ఆమడ దూరంలో ఉంటుందని ఓ జ్యోతిష్కుడు టీవీ చర్చలో చెప్పడం ఆ నోటా ఈ నోటా పడి వైసీపీ పెద్దలదాకా వెళ్లిందట. ఇప్పటికే అమరావతి రావడానికి జగన్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్న ఆ పెద్దలు ఆ జ్యోతిష్కుడి మాటల్ని జగన్ చెవిన వేసే ప్రయత్నాల్లో వున్నారు.
అయితే జగన్ ఇలాంటి వాటిని నమ్ముతారా? నమ్ముతారో లేదో తెలియదుగానీ ఆయనకి అధికారం కావాలన్నది మాత్రం నిజం.ఒకప్పుడు గుడి అనే మాటకి దూరంగా వుండే జగన్ కొందరు స్వామీజీల్ని కలవడం …వారు చెప్పినట్టు పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరపడం ఇంకా కళ్ళ ముందు కదులుతూనే వుంది.ఇక దేవుడి పేరు చెప్పి ఎప్పటికప్పుడు ఎన్నికలొస్తాయని,వాటిలో గెలిచి అధికార పగ్గాలు అందుకోవాలని కలలు కంటున్న జగన్ ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితుల్లో లేరు. ఇక అన్నిటి కన్నా ముఖ్యమైనది నమ్మకం.జ్యోతిష్కుడి మాట మీద ఆ గురి కుదిరితే లోటస్ పాండ్ ఖాళీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.