రాజకీయ వీరుడు.. రాజశేఖరుడు…

 ys rajasekhar reddy special story

వై.ఎస్.రాజశేఖర రెడ్డి…ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆయన ఓ పేజీకాదు ఓ పుస్తకం…ఎన్టీఆర్ తర్వాత రాష్ట్ర రాజకీయ చిత్రంపై బలమైన ముద్రవేసిన నాయకుల్లో అగ్రగణ్యుడు వై.ఎస్…ఎన్టీఆర్ కున్న చరిష్మాలో కొంత వెండితెరకు దక్కుతుంది…కానీ వై.ఎస్. చరిష్మాలో నామమాత్రం కూడా కాంగ్రెస్ కు దక్కదు. ఆయన ఈ స్థానానికి చేరుకోవడం అంత తేలిగ్గా జరగలేదు…సుదీర్ఘ పోరాటంలో ఇది సాధ్యమైంది.  ఆవేశం..ఆలోచనగా, ప్రయాణం..ప్రయత్నంగా, ప్రయత్నం..ఫలితంగా మారే క్రమంలో ఎన్నోఎదురుదెబ్బలు…దారంతా ముళ్ళు, రాళ్లు …పరీక్షలన్నీ పూర్తయ్యాయి. పాదయాత్ర సరికొత్త రాజశేఖరరెడ్డిని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ కి సరికొత్త ప్రజానాయకుడిని పరిచయం చేసింది.

 ys rajasekhar reddy special story

రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్ లోనే అసమ్మతి, పీసీసీ భాద్యతలు… ఇలా ఎన్ని పాత్రలు మారినా ఆయన పక్కన వున్న సహచరులు, అనుచరులు మారలేదు. అదే ఆయన మనస్తత్వానికి నిజమైన ఉదాహరణ. ఒక్కసారి నమ్మివచ్చిన మనిషిని చివరికంటా కాపాడే ఈ నాయకత్వ గుణమే ఆయనకు ఆభరణమైంది. కానీ వ్యక్తిగతం, రాజకీయం వేరు..ఈ రెండింటిలో ఒకే తరహాలో వ్యవహరించడం కుదరదు…తగదు కూడా. కానీ వై.ఎస్. రెండుచోట్ల ఒకే విధంగా ఉండటానికి ప్రయత్నించారు. ఫలితమే ఆయన అనుచరగణం చెలరేగిపోయినతీరు…అవినీతి విశ్వరూపం ప్రదర్శించిన వైనం…

 ys rajasekhar reddy special story

అందుకు ప్రజల సాక్ష్యమే 2014 ఎన్నికలు…రాష్ట్ర్రంలో ఆయన బొటాబొటి మెజార్టీ సాధిస్తే…లోక్ సభకు మాత్రం 33 సీట్లు వచ్చాయి. ఆయన బలం, బలహీనత ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో వేర్వేరు ఫలితాలనిచ్చాయి. ఆతప్పును సరిదిద్దుకొనే క్రమంలో ఉండగానే మృత్యువు హఠాత్తుగా ఆయన్ను తీసుకెళ్లింది.ys death ys rajasekhar reddy special story

ఓ బలమైన నాయకుడు రాజకీయ చిత్రం నుంచి అదృశ్యమైతే ఏమవుతుందో చెప్పడానికి నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పాలిటిక్స్ అసలైన ఉదాహరణ…మేకలు పులులయ్యాయి. రాజకీయ రణక్షేత్ర స్వరూపమే మారిపోయింది. అందుకే ఆయన వ్యతిరేకులు కూడా వై.ఎస్. బ్రతికుంటే ఎలావుండేదో ఊహించుకుంటుంటారు. ఇక అభిమానుల గుండెల్లో ఆయన చిత్రం అమరం…వ్యతిరేకుల ఊహల్లోనూ నిలిచే వుండే బలం వై.ఎస్. సొంతం…ఆ మహానాయకుడి వర్ధంతి సందర్భంగా తెలుగు బుల్లెట్ అర్పిస్తున్నఅక్షర నివాళి ఇదే…

 

SHARE