అప్పుడు వైఎస్..ఇప్పుడు జయలలిత…

Posted December 7, 2016

ys rajasekhara reddy and jayalalitha dead second time win as chief minister
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలిత మధ్య ఒక పోలిక ఉంది. అదేంటంటే ఇద్దరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రెండోసారి సీఎం అయిన తర్వాత మరింత దూకుడు పెంచారు. ఈ తరుణంలోనే విధి వెక్కిరించింది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నెలలలోపే అర్ధాంతరంగా తనువు చాలించారు. చావులోనూ ఇద్దరికీ పోలికలున్నాయి. వైఎస్ చనిపోయే ముందు వరకు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అటు జయలలిత కూడా తాను ఆస్పత్రిలో చేరే ముందు వరకు తన పని తాను చేసుకుపోయారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా… అమ్మకు విధి నిర్వహణలో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ ఒక్కసారి ఆస్పత్రిలో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొదట త్వరలోనే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేస్తారని అనుకున్నా… 75 రోజుల పాటు జయలలిత ఆస్పత్రికే పరిమితమయ్యారు. చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

వైఎస్, జయలలిత అర్థాంతరంగా వెళ్లిపోవడం చూస్తుంటే.. ఒక్క విషయం అర్థమవుతుంది. అదేంటంటే వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయితే కలిసి రాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా రెండోసారి సీఎం పీఠమెక్కితే మృత్యుముఖం నుంచి తప్పించుకోలేరన్న వాదన వినిపిస్తోంది. అసలే సెంటిమెంటును ఎక్కువగా నమ్మే రాజకీయ నాయకులు.. ఇందులో వాస్తవం లేకపోలేదని చెప్పుకుంటున్నారు.

SHARE