Friday, May 27, 2022
Homelatestవిజయమ్మ సాహసం సాక్షికి, జగన్ కి కనపడలేదా?

విజయమ్మ సాహసం సాక్షికి, జగన్ కి కనపడలేదా?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వై.ఎస్.విజయమ్మ..భర్త రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం ఆమెకి కష్టం అన్నది తెలియదు. ఆయన మరణం తర్వాత,కొడుకు జగన్ కాంగ్రెస్ తో విభేదించడం తో ఆమెకి కూడా కష్టాలు తప్పలేదు. వైసీపీ ఏర్పాటు తర్వాత కొడుకు జైలు పాలు కావడంతో కొత్త పార్టీని బతికించడానికి ఆమె కాలికి బలపం కట్టుకు తిరిగారు.కూతురు షర్మిలతో కలిసి వైసీపీ ని ముందుకు నడిపారు.కొడుకు జైలు నుంచి వచ్చినా కిందటి ఎన్నికల్లో ఆమె చురుగ్గా పార్టీ తరపున ప్రచారం చేశారు.అయినా చివరికి తాను పోటీ చేసిన వైజాగ్ స్థానాన్ని కూడా కోల్పోవాల్సివచ్చింది.అక్కడ అమ్మ గెలుపు కోసం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా వున్నాయి.ఇక విజయమ్మ సైతం ఎన్నికల ప్రచార సభల్లో బైబిల్ పట్టుకు వెళ్లడం అప్పట్లో వివాదానికి దారి తీసింది.వైసీపీ ఓటమికి అది కూడా ఓ కారణం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమైతేనేం..ఇటీవల వైసీపీ కార్యక్రమాల్లో విజయమ్మ హాజరు పెద్దగా కనిపించడం లేదు. దీనిపై తలోరకంగా మాట్లాడుకుంటున్నా బయటకు వివరణ ఇచ్చే వారే లేరు.

తాజాగా ఇంకో విషయం కూడా ఇలాగే అయ్యింది.బైబిల్ పట్టుకుని జీవితాంతం క్రీస్తుని ఆరాధించిన విజయమ్మ ఇటీవల మానస సరోవర యాత్రకు వెళ్లారన్న వార్తే సంచలనం అయ్యింది. సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి తో కలిసి ఆమె ఈ వయసులో క్లిష్టమైన మానస సరోవర యాత్ర పూర్తి చేసినట్టు తెలుస్తోంది.కొడుకు జగన్ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే విజయమ్మ ఈ యాత్ర చేసినట్టు చెప్పుకుంటున్నారు.విజయమ్మ యాత్రకు సంబందించిన ఫోటోలు,విశేషాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి కానీ సాక్షిలో ఒక్క ముక్క దాని గురించి రాలేదు. అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు తప్పు అన్నా కావాలి.లేదా ఈ వయసులో విజయమ్మ చేసిన సాహసాన్ని జగన్,సాక్షి పట్టనట్టు ఊరుకుని ఉండాలి.ఇందులో ఏది నిజమైనా లోగుట్టు ఏదో వుందనిపించడం లేదా?

- Advertisment -
spot_img

Most Popular