జ‌గ‌న్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుందా ?

119

Posted November 28, 2016, 10:27 am

jagnmohan-reddy-ptiవైసీపీ అధినేత జ‌గ‌న్… గ‌తంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ పార్టీని వీడేలా చేసిన నాయ‌కులు కూడా చాలామందే ఉన్నారు. హైక‌మాండ్ మెప్పు పొంద‌డానికి జ‌గ‌న్ మీద టెన్ జ‌న్ ప‌థ్ కు రాంగ్ ఇన్ పుట్స్ ఇచ్చార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ త‌ర్వాత ప‌రిణామాలు మారాయి. జ‌గ‌న్ వేరే పార్టీ కూడా స్థాపించారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పోరాడుతున్నారు.

చంద్ర‌బాబును ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క జ‌గ‌న్ మ‌ల్లాగుల్లాలు ప‌డుతుంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌లు సంద‌ట్లో స‌డేమియాలా కొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. ఏపీలో జీరో అయిపోయిన కాంగ్రెస్ కు ప్రాణం పోసేందుకు… ఏపీ నేత‌లు కొత్త లాజిక్ ను చెబుతున్నారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ ను తీవ్రంగా విమ‌ర్శించిన నేత‌లే.. ఇప్పుడు ఆయ‌న‌ను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ లోకి వ‌స్తే… ఆ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి జ‌గ‌న్ నే ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇదీ ఏపీ కాంగ్రెస్ నాయ‌కుల వ‌ర‌స‌. మ‌రి ఇలాంటి లాజిక్కులు లేని ఆఫ‌ర్ల‌కు జ‌గ‌న్ నుంచి ఏం స‌మాధానం వ‌స్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here