Tuesday, October 26, 2021
Homelatestవైసీపీ శవరాజకీయం?

వైసీపీ శవరాజకీయం?

‘తండ్రి శవం ఇంటి నుంచి వెళ్లకముందే అధికారం కోసం ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపారన్నది’..వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొన్న,ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ. అయినా ఆ పార్టీ నాయకులు కళ్ళు తెరవడం లేనట్టుంది. దర్శకరత్న దాసరి మరణవార్తతో తెలుగు ప్రజలంతా విషాదంలో మునిగివుంటే ఈ సందర్భంలో కూడా రాజకీయాల్ని ప్రస్తావించి ఇంకాస్త చెడ్డ పేరు మూటగట్టుకొంటోంది. దాసరికి నివాళి అర్పించాల్సిన తరుణంలో ఆ పార్టీ నేతలైన భూమన కరుణాకర్ రెడ్డి,విజయ్ చందర్ రాజకీయాల్ని ముందుకు తెచ్చారు.జగన్ ని సీఎం చేస్తానని దాసరి తమకు మాట ఇచ్చినట్టు వారు చెప్పుకుంటున్నారు.జరిగిన దానికి,జగన్ సీఎం కావడానికి సంబంధం ఏదైనా ఉందా? ఇప్పటిదాకా ప్రతి సందర్భంలో నేనే కాబోయే సీఎం అంటూ జగన్ బోరు కొట్టిస్తుంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆయనకి తోడయ్యారు.చూసేవాళ్ళకి ఇది శవరాజకీయం అనిపిస్తోంది .

ఇక వైసీపీ అనుకూల వెబ్ సైట్ ఒకటి కనీస విలువలు మరిచి వ్యవహరిస్తోంది. దాసరి మృతికి సంతాపం ప్రకటిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేయడాన్ని కూడా తప్పుబట్టింది.ఎలాంటి వారి గురించి అయినా చనిపోయినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పుకుంటాం.అలాంటిది తెలుగు చిత్రసీమలో దర్శకుడు అనే పేరుకే వన్నె తెచ్చి,అంతటితో ఆగకుండా ఆ విజయప్రస్థానాన్ని రాజకీయాలు,జర్నలిజం దాకా విస్తరించిన ఆ మహానుభావుడి గురించి బాబు గొప్పగా మాట్లాడినా తప్పేనా ? ఇదేనా జర్నలిజం? ఇదంతా వైసీపీ కనుసన్నల్లో జరుగుతుంటే మాత్రం అంతకు మించిన శవరాజకీయం ఉండబోదు.

- Advertisment -
spot_img

Most Popular