ఆ తమిళ పత్రికపై వైసీపీ కడుపు మంట..

0
395
ysrcp leader fires on tamil epaper

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ysrcp leader fires on tamil epaper
ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికలు అనగానే వైసీపీ అధినేత జగన్ కి ఎంత కోపమొస్తుందో తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే వాటికి పచ్చ పత్రికలని ఓ ముద్ర వేసి అవి చేప్పేవాటిలో నిజం లేదని వాదిస్తుంటారు. జగన్ దగ్గర నుంచి వైసీపీ కిందిస్థాయి కార్యకర్త దాకా ఇదే ధోరణి.ఇలా మాట్లాడే ఓ వైసీపీ నేతకి చెన్నై లో వ్యాపారాలు వున్నాయి.తరచూ చెన్నై వెళుతుంటారు కూడా.అలా వెళ్ళినప్పుడు చాలా చోట్ల స్టాల్స్ లో ఓ తమిళ పత్రికపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోటో కనిపించింది.ఆయన ఆలోచన వెంటనే వున్న పార్టీకి తగ్గట్టే ఏదో అవినీతి అన్న కోణంలో సాగింది.ఆ పత్రిక కొనుక్కుని ఆఫీస్ కి వెళ్లి అక్కడ పనిచేసే ఓ తమిళుడిని పిలిపించుకుని చదివి అర్ధం చెప్పమన్నాడంట.అక్కడ విన్నదాంతో ఆయనకి చెమటలు పట్టాయంట.

సీఎం అంటే చంద్రబాబులా వుండాలని ఆ తమిళ వారపత్రిక ఇప్పిడీదాన్ ఇరుక్కువెండ్రమ్ ముదల్వరే పుదియ తలైమురై 4 పేజీల కధనం ఇచ్చింది. అందులో బాబు చాకచక్యం,చొరవ వల్ల తమిళనాడుకి రావాల్సిన ఎన్నో వ్యాపార సంస్థలు ఆంధ్రాకి ముఖ్యంగా శ్రీ సిటీ కి వెళుతున్నాయని సదరు పత్రిక వివరణాత్మక కధనం ఇచ్చింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లడం ఖాయమని ఆ పత్రిక వివరించింది,ఇప్పటిదాకా ఏపీ గవర్నమెంట్ చెప్తుంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసిన సదరు నాయకుడు హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని ట్రై చేసి చివరి నిమిషంలో ఏమి జరుగుతుందో అని మౌనం దాల్చారట. ఆయన నోరు తెరిచి ఉంటే ఆ తమిళ పత్రిక కి చంద్రబాబుకి ఏదో లంకె పెడుతూ సోషల్ మీడియాలోనే ,సాక్షిలోనో కధనం వచ్చేది.అంతకు మించి ఏమి జరుగుతుంది? నిద్ర పోయేవాడిని లేపొచ్చుగానీ నిద్ర నటించే వారిని ఎలా లేపగలం?

Leave a Reply