లోకేష్ మీద సీబీ’ఐ’?

0
477
ysrcp leader gudivada amarnath complaint to cbi against on nara lokesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ysrcp leader gudivada amarnath complaint to cbi against on nara lokesh
ఏపీ మంత్రి,ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ మీద సీబీఐ కన్ను పడిందా? ..లేదు.కానీ అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది వైసీపీ.ఎన్నో అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న తమ అధినేత జగన్ ,లోకేష్ వ్యవహారశైలిలో పెద్ద తేడా లేదని చెప్పేందుకు వైసీపీ దృష్టి సారించింది. ఇందుకోసం మహానాడు జరగబోతున్న విశాఖ వేదికగా ఓ భూవివాదంలో లోకేష్ పేరు ఇరికించేందుకు వైసీపీ ఓ అడుగు ముందుకు వేసింది.

విశాఖలో డెస్పల్లా హిల్స్ కి సంబంధించి భూమి కబ్జాకి గురి అయ్యిందని వైసీపీ ఆరోపిస్తోంది.ఆ భూమి విలువ 1500 కోట్లు ఉంటుందని కూడా ఆ పార్టీ చెబుతోంది.కురుపాం కి చెందిన రాజవంశస్తురాలు రాణి కమలమ్మ ని బినామీగా చేర్చి ఈ కుంభకోణాన్ని లోకేష్ నడిపిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.ఇందుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో లోకేష్ మీద సీబీఐ కి ఫిర్యాదు చేసినట్టు ఆయన వివరించారు.టీడీపీ,బీజేపీ సంబంధాలు అంత సానుకూలంగా లేనట్టు కనిపిస్తున్న ఈ తరుణంలో వైసీపీ ఫిర్యాదు మీద సీబీఐ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి.ఎక్కడా లోకేష్ హస్తముందని ఆధారాలు లేకపోయినా వైసీపీ ఆయన మీద నేరుగా సీబీఐ ని ఆశ్రయించడం కేవలం రాజకీయ దుగ్ధతో జరిగిందా లేక అంతకు మించి ఏదైనా కుట్ర ఉందా అన్నది తేలాల్సి వుంది.

Leave a Reply