బాబు,మోడీ మధ్య వైసీపీ చిచ్చు..

Posted October 12, 2016

 ysrcp leader partha sarathi fire chandrababu
సైకిల్,కమలం మధ్య విబేధాలు రగల్చడానికి వైసీపీ మరో పాచిక విసిరింది.నల్లధనం విషయంలో పరోక్షంగా జగన్ ని టార్గెట్ చేస్తూ 10 వేల కోట్లు విషయాన్ని ప్రస్తావించారు.దీంతో మండిపడ్డ వైసీపీ బ్లాక్ మనీ వెల్లడికి మోడీ ప్రవేశపెట్టిన పధకాన్ని బాబు తప్పుపడుతున్నారా అని ప్రశ్నిస్తోంది.ఆ పార్టీ నేత పార్థసారథి ప్రెస్ మీట్ బులెట్ పాయింట్స్ ఇవే ..

 • కేంద్ర ప్రకటనకు విరుద్ధంగా బాద్యతా రాహిత్యంగా సీఎం చంద్రబాబు నల్లధనం పై వ్యాఖ్యలు చేస్తున్నారు.
 • పది వేల కోట్ల రూపాయల నల్లధనం జగన్ కట్టారని టీడీపీ నేతలు ఎలా అంటున్నారో దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి.
 • చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ గౌరవాన్ని దిగజారీఛే విధంగా ఉన్నాయ్.
 • కేంద్రం నుంచి సీఎంకు ఏమైన సమాచారం అందిందా… రాష్టానికి ఏమైన ఇబ్బందికర పరిస్థితులు వాటిళ్ళుతాయాని.రాకెట్ లంచార్లు గురించి ఎందుకు మాట్లాడారు.
 • సీఎం అశుభంగా కార్యాలయ ప్రారంభం చేశారు.
 • బాబు మొదటి సంతకం ద్వారా ఇప్పటి వరకు ఏమి అమలు కాలేదు.
 • ఇప్పటి వరకు ఒక్క మహిళకు డ్వాక్రా రుణాలు రూపాయి కూడా మాఫీ కాలేదు.
 • ఎందుకు మోసపూరిత ప్రకటనలు, సంతకాలు?
 • బ్లాక్ మనీ గురించి చంద్రబాబు మాట్లాడటం చూసి ప్రజలు విస్తూ పోతున్నారు.
 • దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి, మంత్రి కలిగి ఉన్నది ఎపి అని ఓ ప్రైవేట్ సంస్థ తెలిపింది.
SHARE