వైసీపీకి పిల్లి శల్యసారథ్యం..!

0
675
ysrcp lost in pilli subhash chandra bose constituency ramachandrapuram municipal ward elections

Posted [relativedate]

ysrcp lost in pilli subhash chandra bose constituency ramachandrapuram municipal ward electionsమాజీమంత్రి, ప్రస్తుత పమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా బలహీనపడుతోంది. అందుకు తాజా ఉదాహరణగా రామచంద్రపురం పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు నిలిచాయి. రామచంద్రపురం మున్సిపాలిటీలో 17,21,23 వార్డులకు ఏప్రిల్‌ 9న ఉపఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లయ్యేసరికి వైకాపా కార్యకర్తలు కంగుతిన్నారు. బోసు స్వంత సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు ఉన్న 25వ వార్డుతో పాటు మొత్తం 3వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు పరాజయం పాలుకావడం వారికి అవమానకంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించడం చర్చనీయాంశమయ్యింది.

బోసు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న 25వ వార్డులో తెలుగుదేశం అభ్యర్ధికి భారీ మెజారిటీ లభించింది. స్థానిక నాయకత్వం ప్రజల్లో పట్టుకోల్పోవడం వలనే ఇలా జరిగిందని పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 21వ వార్డులో విద్యావంతులు, ధనిక, మధ్యతరగతి వర్గాల వారు అధికంగా ఉన్నారు. ఈ వార్డు కూడా తెలుగుదేశం కైవశమయ్యింది. 17వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్ధి పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలావుంటే ఈ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండు స్థానాలు లభిస్తాయని వైసీపీ నేతలు ఊహించారు. అయితే బోసు నాయకత్వ లోపంతో మూడు స్థానాలనూ వదుకోవల్సి వచ్చిందని వాపోతున్నారు.

బోసు నిర్లక్ష్య వైఖరి కారణంగానే స్వంత సామాజికవర్గం శెట్టిబలిజలు ఉన్న 25వ వార్డులో తెలుగుదేశానికి 700 ఓట్లు లభించగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కేవలం 148 ఓట్లు దక్కడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. గెలవాల్సిన చోట కూడా ఇంత దారుణంగా ఓడిపోతే భవిష్యత్‌లో రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే రామచంద్రపురంలోని కె గంగవరం, కాజులూరు వైసీపీ కన్వీనర్లు ప్రజల్లో రావడం లేదన్న విమర్శలున్నాయి. ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా పార్టీకి దూరమవుతుండటం పట్ల కార్యకర్తలు వాపోతున్నారు.

Leave a Reply