ప్రకాశం వైసీపీ ఖాళీ..దేశంలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

    ysrcp mla's suresh and venkata reddy prakasam district jump tdp
మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీ అధినేత జగన్ కి షాక్ ఇవ్వబోతోంది.ప్రకాశం జిల్లాలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది.సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ,మార్కాపురం ఎమ్మెల్యే జి.వెంకట రెడ్డి అధికార పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.స్థానిక పరిస్థితుల్ని దృష్టితో అసంతృప్తిగా వున్న ఈ ఇద్దరినీ అదే జిల్లాకి చెందిన దేశం సీనియర్ నేత ఆకర్షించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ ఇద్దరు కూడా సైకిల్ ఎక్కితే ప్రకాశం లో వైసీపీ ఖాళీ అయినట్టే.

2014 లో ప్రకాశంలో 12 స్థానాలకు గాను వైసీపీ 6, తెలుగు దేశం 5 ,ఇండిపెండెంట్ ఒక్క స్థానం గెలుచుకున్నారు.వైసీపీ నుంచి గెలిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ,అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ,కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ,చీరాల నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.తాజా వలసల పర్వం ఖరారైతే జిల్లాలో వైసీపీ నిల్ సైకిల్ ఫుల్ అయిపోయినట్టే.

SHARE