రోజా ఫైరింగ్… బులెట్ పాయింట్స్

Posted March 21, 2017

 • ysrcp mla roja comments on mlc elections resultsఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా వైఎస్ ఆర్ సీపీ నే గెలిచింది.
 • ఓటుకు కోట్లు కేసు లో చంద్రబాబు కు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఏపీ లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు.
 • రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మూడు ఎమ్మెల్సీలను గెలిచిన ఘనత చంద్రబాబుదే.
 • కర్నూలులో శిల్పాచక్రపాణిరెడ్డి గతంలో 147 ఒట్లతో గెలిచారు.
 • 5 ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మెజార్టీ 57 కు తగ్గింది.
 • మరీ టీడీపీ గెలిచినట్టా..? ఓడినట్టా..?
 • ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు.
 • మీకు నిజంగా ప్రజాబలం ఉంటే కొనుగోలు చేసిన 21ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా..?.
 • మంత్రి గంటా పాలన గాలికొదిలేసి ఒట్లు కొనుక్కోవడంలో బీజీగా ఉన్నారు.
 • ఆయన సొంత జిల్లా లో డిగ్రీ పేపర్ లీకైంది,ఇంఛార్జ్ గా ఉన్న జిల్లా లో టెన్త్ పేపర్ లీకైంది.
 • మంత్రులు గంటా,అచ్చెన్నాయుడు,నారాయణ జిల్లాల్లో నే ఉండి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేశారు.
 • ఎన్నికల్లో గెలుస్తామన్న ధైర్యం బాబు కు ఉంటే లోకేష్ ను ఎందుకు పోటీ పెట్టలేదు.
 • ఓడిపోతామనే భయంతోనే లోకేష్ ను దొడ్డిదారిన మండలికి పంపారు.
 • గంతంలో ఉపఎన్నికల్లో టీడీపీ 18 స్ధానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.
 • ఆ చరిత్ర మరిచిపోతే ఎలా ?.
 • సింహం సింగిల్ గానే వస్తుంది…ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతుంది.
 • ఎంపీటీసీలు,జడ్పీటీసీలను కొని గెలవడం గెలుపు కాదు.
SHARE