వైసీపీ ఎమ్మెల్యేల‌ను టెన్షన్ పెడుతున్న జ‌గ‌న్!!

 Posted April 1, 2017

ysrcp mlas tension about on jagan case
వైసీపీ అధినేత జ‌గ‌న్ ను అక్ర‌మాస్తుల కేసు వెంటాడుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న ఏడాదిన్న‌ర పాటు జైలు జీవితం గడిపారు. ఈసారి మ‌ళ్లీ జైలుకెళ్ల‌బోతున్నారానే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదే జ‌రిగితే వైసీపీ ఫ్యూచ‌ర్ ఏంట‌ని వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నార‌ట‌.

ఈ మ‌ధ్య సాక్షి ఛానలో ఓ ఇంట‌ర్వ్యూ ప్ర‌సార‌మైంది. ఆ ఇంట‌ర్వ్యూ కేసును ప్ర‌భావితం చేసేలా ఉంద‌ని సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసింది. పిటిష‌న్ ను స్వీక‌రించిన న్యాయ‌స్థానం… వ‌చ్చే నెల 7లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జ‌గ‌న్ కు సూచించింది. దీంతో ఆయ‌న మ‌ళ్లీ జైలుకెళ్ల‌బోతున్నారా అన్న ఊహాగానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ జైలు వార్త‌ల నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ ప‌డుతున్నార‌ట‌. సారు జైలుకెళ్లితే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న చెందుతున్నారట‌. అస‌లే ఇంకో రెండేళ్లే టైముంది. ఈలోపు పార్టీ మారాలా? లేక ఇదే పార్టీలో కొన‌సాగాలా? ఒక‌వేళ జ‌గ‌న్ జైలుకెళ్లితే వైసీపీని న‌డిపించేదెవ‌రు? జ‌గ‌న్ కాకుండా వేరే వ్య‌క్తులైతే టీడీపీని త‌ట్టుకుంటారా? అని గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌.

కొంద‌రైతే ఈ టెన్షన్ అంతా ఎందుకు? ఎంచ‌క్కా సైకిల్ ఎక్కేస్తే బేఫిక‌ర్ గా ఉంటుందిగా అని ఆలోచిస్తున్నార‌ట‌. అయితే ఈ విష‌యం ఇంకా టీడీపీ దాకా వెళ్లిందో లేదో తెలీదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా ఆలోచిస్తున్నార‌ని తెలిస్తే.. టీడీపీ మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌తీసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్. అదే జ‌రిగితే వైసీపీకి పెద్ద షాకేనంటున్నారు విశ్లేష‌కులు.

SHARE