Thursday, January 20, 2022
Homelatestనంద్యాల వైసీపీ అభ్యర్థి ఇతనే . మలుపు తిరిగిన రాజకీయం?

నంద్యాల వైసీపీ అభ్యర్థి ఇతనే . మలుపు తిరిగిన రాజకీయం?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నూలు జిల్లా,నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పర్వం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటిదాకా రేసులో వెనుకపడిందని భావించిన వైసీపీ అధికార టీడీపీ ని కంగు తినిపించే ఎత్తుగడ అమలు చేసింది.నంద్యాల టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి కి సొంత మామ అయిన కాటసాని రామిరెడ్డి తో వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించారు.ఆ అభ్యర్థి నంద్యాల పార్టీ ఇంచార్జ్ మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి. సొంత అల్లుడు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తుంటే,ఆయనకు వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా ఆయన గెలుపు కోసం పనిచేస్తామని కాటసాని ప్రకటించడం నంద్యాల రాజకీయాన్ని ఇంకో మలుపు తిప్పింది.

katasani rami reddy support to malkirerddy rajagopal reddy in nandyala by poll electionsనంద్యాలలో వైసీపీ గెలుపు మాట ఎలా వున్నా గట్టి అభ్యర్థిని బరిలోకి దించగలదా అనిపించింది ఓ దశలో.అయితే ఇప్పుడు ఆ పార్టీ వేసిన స్టెప్ తో టీడీపీ నే పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే వైసీపీ,టీడీపీ లు ఇక్కడ స్థానిక పరిస్థితులకి అనుగుణంగా తమ వ్యూహాల్ని రూపొందించుకోవాల్సి వస్తోంది తప్ప,పార్టీ నిర్ణయాలకు తగ్గట్టు స్థానిక నేతల్ని మలుచుకోవడం కష్టం అవుతోంది.ఈ పరిస్థితుల్లో మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular