వైసీపీ క్రియేటివిటీ అదిరిపోయింది..

Posted October 9, 2016

 ysrcp party ambati rambabu said chandrababu chief security officer nagendra

ఏపీ హోమ్ మంత్రి చినరాజప్ప ని లోకేష్ అవమానించాడంటూ చేసిన ప్రచారంతో పరువుపోయినా వైసీపీ బుద్ధి మారలేదు. టీడీపీని, చంద్రబాబుని కుల రాజకీయాల్లోకి లాగేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం లేదు. తాజాగా ఆ పార్టీ వాయిస్ ని స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినిపించే అంబటి రాంబాబు గారు ఓ శాస్త్రవేత్తలా కష్టపడి ఓ కొత్త విషయం కనిపెట్టారు. అదేంటంటే చంద్రబాబు వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న నాగేంద్ర తొలగింపుకి కారణం కనిపెట్టారు. అదేమిటంటే …అయన ఇంటిపేరు ముద్రగడ కాబట్టి అంట.. అబ్బా అబ్బా ఏమి క్రియేటివిటీ.. అదిరిపోయింది.. అదే నిజమనుకుంటే ఈ వ్యాఖ్యలు చేసిన వైసీపీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

1. ఏపీ లో ఏ రాజకీయనేత వద్ద ముఖ్యంగా సీఎం స్థాయి వ్యక్తి దగ్గర నాగేంద్ర అంత కాలం పని చేసిన సెక్యూరిటీ అధికారి ఎవరైనా ఉన్నారా ?
2. నాగేంద్ర ఇంటి పేరు ముద్రగడ కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఆయన్ను బాబు సెక్యూరిటీ అధికారిగా ఉంచుకున్నారా?
3 . చంద్ర బాబు ఇంట్లో సొంత మనిషిలా వుండే చనువుని అడ్డం పెట్టుకుని ముఖ్య నేతల పట్ల కూడా నాగేంద్ర దురుసుగా వ్యవహరించిన సందర్భాలు లేవా?
4.ఓ ఉద్యోగిని ..ముఖ్యంగా భద్రతా విభాగంలో పనిచేసే వాళ్ళని తరచూ మార్చడం సాధారణ అంశం కాదా ?
స్టోరీ అల్లేటప్పుడు ఎలాగైనా అల్లేయొచ్చు.కానీ జనం పిచ్చి వాళ్ళు కాదు.స్టోరీ కి లాజిక్ లేకపోయినా …చెప్పే విషయం చెత్త అయినా సినిమా నే కాదు రాజకీయం కూడా ప్లాప్ షో అవుతుంది.

SHARE