వెంకయ్య పై వైసీపీ టార్గెట్ ఎందుకంటే?

Posted September 29, 2016

 ysrcp party bhumana karunakar reddy target venkaiah
ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ స్టాండ్ మార్చింది. బాబుకి వెంకయ్యని జతకలిపి మాట్లాడుతున్నారు ఆ పార్టీ నేతలు.ప్రత్యేక హోదా అంశం మరుగుపరిచేందుకే వాళ్లిద్దరూ కుట్ర పన్నుతున్నారని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో బీజేపీ నేతగా,కేంద్ర మంత్రిగా ఉంటున్న వెంకయ్య రాష్ట్రానికి వచ్చేసరికి టీడీపీ అధికారప్రతినిధిగా మారిపోతున్నారని అయన ఆరోపించారు.మనుషులు వేరైనా వాళ్ళ మనసులు,అబద్ధపు మాటలు ఒక్కటేనని భూమన మండిపడ్డారు..అందుకే బాబు,వెంకయ్యల్ని అవిభక్త కవలలుగా అభివర్ణించారు భూమన.

వెంకయ్య మీద వైసీపీ ఈ స్థాయిలో మండిపడటానికి కారణం కూడా తేలిగ్గానే అర్ధమవుతోంది. మామూలుగా అయితే కేంద్రం ప్యాకేజ్ ప్రకటించి దూరంగా వెళ్ళిపోతుంది…చంద్రబాబుని టార్గెట్ చేయొచ్చని వైసీపీ భావించింది.కానీ అందుకు భిన్నంగా ప్యాకేజ్ ప్రకటన తరువాత వెంకయ్య ఏపీ లోనే ఎక్కువగా ఉండటం..ప్యాకేజ్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించడం వైసీపీ ని ఇబ్బంది పెడుతోంది.సరే భరిద్దామనుకుంటే బాబు మీద విమర్శలకు కూడా వెంకయ్య సమాధానం ఇస్తుండడం ..బాబు దిగిపోతే కుర్చీ ఎక్కాలని కొందరు ఆరాటపడుతున్నారంటూ జగన్ పై పరోక్ష దాడికి దిగుతుండడం తో వైసీపీ కి మండిపోయింది.అటు కేంద్రంలో తనకున్న పలుకుబడి ఉపయోగించి జగన్ అవినీతి కేసుల విషయంలో నట్లు బిగిస్తున్నట్టు వెంకయ్య మీద వైసీపీ డౌట్. కొందరు అధికారులు ఈ విషయం గురించి జగన్ చెవిలో చెప్పారట.ఇది వెంకయ్యని వైసీపీ టార్గెట్ చేయడం వెనుక కధ.

SHARE