వైసీపీ కొత్త సంప్రదాయం

0
710
ysrcp party plenary meetings in vijayawada

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ysrcp party plenary meetings in vijayawadaవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను తొలిసారిగా విజయవాడలో ప్లీనరీ నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. జూలై 8 – 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. గత ప్లీనరీలన్నీ ఇడుపాయలపాయలో జరిగాయి. అయితే ఈసారి మాత్రం అమరావతిపై ఫోకస్ పెడుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో కూడా ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.

జూలై 8 -9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని జూన్ 19 – 20 -21 తేదీల్లో వైఎస్ ఆర్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. ఆ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు. ఇక మే చివరివారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు రెండోదశలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే హైదరాబాద్ లో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయి.

ఇదిలాఉండగా….గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిని విద్యార్థులు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు.

Leave a Reply