Posted [relativedate]
ఏపీకి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చే అవకాశముందని తెలుగు బుల్లెట్ చాలా రోజుల ముందే చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతుందా అంటే ఔననే అనిపిస్తోంది తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే. ఈ మధ్య జరిగిన పార్టీ మీటింగ్ లో స్వయానా జగనే ఈ విషయాన్ని ప్రసావించారని సమాచారం. పార్టీ మీటింగ్ లో ప్రశాంత్ కిశోర్ గురించి పెద్ద చర్చే జరిగిందట. వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఖాయమని చెప్పుకొచ్చారట. ఇక ఆయన రాయడమే ఆలస్యమే అన్నంతగా చెప్పారట జగన్. అందుకే ఇప్పట్నుంచే ఆదిశగా వైసీపీ ప్లాన్ ఉండాలని పార్టీ నాయకులకు సూచించారని సమాచారం.
ప్రశాంత్ కిశోర్ ఒక్కసారి వచ్చేస్తే అంతా సర్దుకుంటుందని జగన్.. తన పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారట. అంటే చాన్నాళ్ల ముందే ప్రశాంత్ కిశోర్ విషయంలో తెలుగు బుల్లెట్ చెప్పిందే ఇప్పుడు నిజమైందన్న మాట. ఇంత వరకు ఓకే కానీ ప్రశాంత్ తో నైనా జగన్ ఫేట్ మారుతుందా? ఎప్పటిలాగే ఉంటుందా ? చూడాలి