ఆర్కే ముందు దేశం పప్పులుడకలేదు..

 Posted October 29, 2016

ysrcp party win mangalagiri vice president elections by alla rama krishna reddy
న్యాయ పోరాటాలతో చంద్రబాబు సర్కార్ ని ముప్పుతిప్పలు పెడుతున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఈసారి దేశానికి తన రాజకీయ వ్యూహచతురత కూడా చూపించాడు.అయన నియోజకవర్గ పరిధిలో ఓ ఎన్నిక విషయంలో దేశం ఎత్తులు ఆర్కే ముందు పారలేదు.అధికార పార్టీ పప్పులుడక్కుండా ఆర్కే భలే మేనేజ్ చేసాడు.

మంగళగిరి నియోజకవర్గ పరిధి లోని దుగ్గిరాల మండల ఉపాధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికలలో YSRCP విజయం సాధించింది. ఈరోజు ఉద్రిక్తత వాతావరణం లో జరిగిన ఎన్నికలలో MLA RK గారి ఎత్తుగడలు ఫలించాయి. మొత్తం 18 మందు సభ్యులలో 11 మంది YCP వారు కాగా, 6 టీడీపీ, 1 సీ.పి. మ్. ఉన్నారు. ఐతే ఉపాధ్యక్ష ఎన్నికల కోసం టీడీపీ వారు వైసీపీ కి చెందిన 1 ఎంపీటీసీ ని ప్రలోభాలకు గురిచేసి తిప్పుకున్నారు. 10 మంది ఎంపీటీసీ లతో ఉపాధ్యక్ష పదవి వైసీపీ దక్కించుకుంది.టీడీపీ వారి ప్రలోభాలకు లొంగని వైసీపీ ఎంపీటీసీ లు MLA RK గారికి బాసటగా నిలిచారు,ఫలితాన్ని ముందే ఊహించిన టీడీపీ ఎన్నికల బరినుండి తప్పుకుంది.

SHARE