వైసీపీ ,బాబు హడావిడిలో నిజమెంత?

0
475
ysrcp party win teachers graduations constituency mlc election tdp wins mlc elections

 Posted [relativedate]

ysrcp party win teachers graduations constituency mlc election tdp wins mlc elections
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో షాక్ అయిన వైసీపీ కి కొన్ని గంటల వ్యవధిలోనే ఊరట దొరికింది.ఉపాధ్యాయ,గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐడింటికిగాను అధికార టీడీపీ ని కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేయగలిగింది వైసీపీ.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస వేణుగోపాల రెడ్డి 14 , 146 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి మీద గెలిచారు.మరో మూడు చోట్ల వైసీపీ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థులు విజయం సాధించారు.ఒక్క ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలిచారు.ఈ ఫలితాలు రాగానే అమరావతిలో ని వైసీపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.అధినేత జగన్, మిగిలిన నేతలతో కలిసి స్వీట్లు పంచుకుని తిన్నారు.లక్షల మంది చదువుకున్నవాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్న ఈ ఎన్నికలు టీడీపీ కి భవిష్యత్ లో ఎదురయ్యే పరాభవానికి సూచిక అని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.ఇక నిన్నామొన్న అధికార టీడీపీ చేసిన హడావిడి ఇంతకుమించి వుంది. నిజంగా ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీల బలాబలాలకు అద్దం పడుతున్నాయా?

టీడీపీ జబ్బలు చరుచుకుంటున్న కడప,కర్నూల్,నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధుల ఓటర్ల సంఖ్య దాదాపు ఐదు వేలు మాత్రమే.పైగా వీళ్లంతా తమ అభిప్రాయాల ప్రకారం ఓట్లు వేయలేదు.టీడీపీ,వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు,క్యాంపులు,ధన రాజకీయంలో పావులుగా వ్యవహరించినవాళ్ళే ఎక్కువ.ఇక ఉపాధ్యాయ,గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో వైసీపీ విజయోత్సవ వేడుకల్లో కూడా నిజాయితీ లేదు.ఈ ఎన్నికలు ఉపాధ్యాయ యూనియన్ రాజకీయాల కోణంలో జరుగుతాయని,వామపక్ష మద్దతు వున్న అభ్యర్థులు గెలుస్తారని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.నేరుగా అభ్యర్థిని నిలబెట్టినా ప్రయోజనం ఉండదని భావించే వైసీపీ తనకు పూర్తి పట్టున్న పశ్చిమ రాయలసీమకు పరిమితమై మిగిలిన చోట్ల పిడిఎఫ్ కి మద్దతు ఇచ్చింది. ఇంతోటిదానికి ఇటు టీడీపీ ,అటు వైసీపీ చేస్తున్న హడావిడి చూస్తుంటే నవ్వొస్తోంది. ఈ వ్యవహారాలతో కొన్నాళ్ళు జనాన్ని మభ్యపెట్టొచ్చేమో గానీ …వారి అభిప్రాయాలని వీటితోనే మౌల్డ్ చేయొచ్చు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు.

Leave a Reply