Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీ పెద్దలు ఎందరు వద్దని చెప్పినా,పాత వైఫల్యాల్ని సాకులుగా చూపినా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గుజూపాడు.2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రశాంత్ వ్యూహాలు పనిచేస్తాయని బలంగా నమ్ముతున్నాడు జగన్.అటు ప్రశాంత్ కిషోర్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి.ఆకలి మీద వున్న చిరుతల్లా ఈ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని వైసీపీ శ్రేణులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నాయి.సాక్షి భవన్ నుంచే ప్రశాంత్ టీం పని మొదలెట్టింది.ఎన్నికల వ్యూహాల కన్నా ముందుగా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ప్రశాంత్ దృష్టి పెట్టారు.ఆ విషయం గురించి ఆరా తీస్తుంటే ఆశ్చర్యకర విషయాలు వెలుగుజూస్తున్నాయి. పార్టీ బలానికి పార్టీ సభ్యత్వానికి సంబంధం లేకుండా ఉందని ప్రశాంత్ టీం జగన్ కి చెప్పిందట. పార్టీ కి పునాది ఈ సభ్యత్వ కార్యక్రమమే అని జగన్ కి వివరించిందట.
ఒకప్పుడు వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్లు ఇదే విషయం చెప్పి జగన్ ని ఒప్పించడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు.తన పేస్ వేల్యూ తో ఓట్లు పడతాయని భావించిన జగన్ వారి మాటలు పట్టించుకోలేదు.కానీ ఇప్పుడు అదే విషయాన్ని భారీగా ఫీజు తీసుకుంటున్న ప్రశాంత్ టీం చెప్పేసరికి జగన్ అలెర్ట్ అయ్యారు.సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.అయితే ఒకప్పుడు తాము చెప్పినప్పుడు పట్టించుకోని హైకమాండ్ అదే పని గురించి ఒత్తిడి చేస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదట.దీంతో జగన్ లో కంగారు కనిపిస్తోందట. ఈ సమస్యని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.