Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా రావడం వైసీపీ లో కొందరికి ఇష్టం లేదా? అందుకే పైకి జగన్ మాట విన్నట్టు నటిస్తూ ప్రశాంత్ కి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? ఈ ప్రశ్నలకి ఔననే జవాబు చెప్పుకోవాల్సి వస్తోంది.వైసీపీ తరపున సోషల్ మీడియాలో లోకేష్ ని టార్గెట్ చేసి రవికిరణ్ దొరికిపోడానికి ,ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు సంకేతాలు ఇవ్వడం,ఆ వెంటనే జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం వెంటవెంటనే జరిగిపోయిన పరిణామాలు.ఇవి జరిగిన 48 గంటల లోపే జగన్ తో ప్రశాంత్ ఒప్పందం కుదిరినట్టు వార్తలు వచ్చాయి.అది తెలిసిన గంట వ్యవధిలోనే పొలిటికల్ పంచ్ కేసులో ప్రశాంత్ కిషోర్ ని బాధ్యుడుగా చేస్తూ సోషల్ మీడియా కోడై కూసింది. అందులో వైసీపీ అనుకూల సోషల్ మీడియా కూడా ఉండటంతో లోగుట్టు ఏదో ఉందన్న సందేహం వచ్చి ఆ పార్టీ కార్యాలయంలో కీలక వ్యక్తిని కదిలిస్తే చెప్పానంటూనే కొన్ని నిజాలు కక్కేసాడు.
ప్రశాంత్ కిషోర్ సీన్ లోకి రావడం ఇన్నాళ్లు జగన్ వెన్నంటి వున్న కొందరు నేతలకు ఇష్టం లేదట. ఆయన వస్తే ఇప్పటిదాకా వ్యూహరచనలో భాగమైనవాళ్లము ఇక చెప్పింది చేసే టీం లోకి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నారట.తమ ప్రాధాన్యం తగ్గడం ఇష్టం లేని ఆ నేతలు జగన్ మాటకి పైకి సై అంటూ లోన నై అంటున్నారు.అందుకే ఆయన్ని నిలువరించడానికి తమకి చేతనైన పద్ధతుల్లో ట్రై చేస్తున్నారు.అందులో భాగమే పొలిటికల్ పంచ్ కేసుని ఆయన తో ముడిపెడుతూ వచ్చిన కధనాలు అంటున్నారు.యూపీ లో ప్రశాంత్ విషయం లో కాంగ్రెస్ నేతలు ఇలాగే కొట్టుకుని బజారున పడి అపజయాన్ని మాత్రం ఆయన మెడకి చుట్టారు.వైసీపీ లో తాజా పరిణామాలు కూడా ఆ దిశగానే నడుస్తున్నట్ట్టు లేదూ!