Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పుడు పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్ తో లోకేష్ మీద వైసీపీ అనుకూల సోషల్ మీడియా దాడి గురించి చర్చ సాగుతోంది కానీ ..ఎప్పటినుంచో ఆ ప్రచారం సాగుతూనే వుంది.రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రచారం శాసనమండలి ఫోటో ముందు ఏ సర్టిఫికెట్ సినిమా పోస్టర్ తగిలించడంతో పతాక స్థాయికి చేరింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగడం,సోషల్ మీడియా ప్రచారం మీద విస్తృతంగా చర్చ సాగడం అందరం చూస్తూనే వున్నాం.అటు టీడీపీ కూడా సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయడంతో వైసీపీ తెలివైన ప్రతివ్యూహం పన్నుతోంది.కొన్నాళ్ళు లోకేష్ మీద సోషల్ మీడియాతో దాడి తగ్గించి,స్థానిక పత్రికల ద్వారా బ్రాహ్మణి మీద వార్తలు రాయించేందుకు రెడీ అయ్యింది.
చిన్న చిన్న టౌన్స్,జిల్లా కేంద్రాల్లో ప్రింట్ అయ్యే పత్రికల యజమానులని పట్టుకుని వారికి ఆర్ధిక సహకారం అందించడం ద్వారా టీడీపీ వ్యతిరేక కధనాలు వండి వార్చుతోంది.ఆ పత్రికల కథనాల్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తోంది.ఇప్పుడు ఆ కోవలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం నుంచి వస్తున్న ఓ పత్రికలో బ్రాహ్మణిని టార్గెట్ చేస్తూ ఓ కధనం అల్లారు.ఆమె పోరు పడలేకే లోకేష్ ని చంద్రబాబు మంత్రిని చేశారట,ఇప్పుడు ఎంపీ స్థానానికి విజయవాడ నుంచి పోటీ చేయాల్సిందేనని బ్రాహ్మణి పట్టుబడుతున్నారట..ఈ తరహా కథనాలతో బ్రాహ్మణి ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కి లోకేష్ బోర్ కొట్టినట్టున్నాడు.