కోట్లు కుమ్మరిస్తున్న వైసీపీ?

0
524
ysrcp spend more money in kadapa mlc elections for vivekananda reddy

Posted [relativedate]

ysrcp spend more money in kadapa mlc elections for vivekananda reddy
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డి తరపున ఆ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వివేకా గెలుపును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని టాక్.

మొత్తం కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 841 ఓట్లు ఉండగా అందులో ఎక్కువ అనుకూలంగా ఉన్నది వైకాపాకు మాత్రమే. కానీ టీడీపీ కూడా చాపకింద నీరులా తన ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో తమ అభ్యర్థి బిటెక్ రవిని గెలిపించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు ఈ జిల్లాపై ప్రత్యేక శద్ధ పెట్టారు. అందుకే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు జగన్ వ్యూహాలు మీద వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని వైసీపీ శ్రేణులకు జగన్ సూచించారట. ఈ మేరకు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏకంగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే 60 శాతం డబ్బులను ఖర్చు చేశారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు వంద కోట్ల బడ్జెట్ సరిపోకపోతే మరో 20 కోట్ల రూపాయలు కూడా సిద్ధంగా ఉంచారట.

వైసీపీ కోట్లు కుమ్మరిస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు పండుగ చేసుకుంటున్నారట. దొరికిందే ఛాన్స్ గా డబ్బులు బాగానే వెనకేసుకుంటున్నారని టాక్. ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ 5 లక్షల రూపాయలు ఇస్తున్నారట వైసీపీ నేతలు. డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు.. కానీ ఓటు మాత్రం వివేకాకే వేయాలని కోరుతున్నారట. అయితే వీరంతా వైసీపీకే ఓటేస్తారా? లేక షాకిస్తారా? ఎన్నికల ఫలితాల్లో తేలిపోనుంది.

Leave a Reply