లోక్ సభలో ప్రత్యేక హోదా పోరు ఉద్ధృతి తగ్గింది.వైసీపీ ఎంపీలు యధాప్రకారం సభలో నినాదాలు ,ప్లకార్డులతో తమ డిమాండ్ వినిపించారు .స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్ని సార్లు చెప్పినా వైసీపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు .నుంచున్న చోట నుంచి వాళ్ళు కదల్లేదు.
మరో వైపు తెలుగుదేశం ఎంపీలు మాత్రం జైట్లీ హామీ నేపథ్యంలో మౌనం గా వున్నారు.జీఎస్టీ బిల్లు తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఉద్యమిస్తామని సభ వెలుపల ప్రకటించారు.మరోవైపు మొత్తం వ్యవహారానికి కారణమైన కాంగ్రెస్ సభలో ఈ అంశాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.ఏపీ నుంచి సభ్యులెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నింపాదిగా ఉండగలుగుతోంది.