మహానాడుకి ఎన్టీఆర్ ని బలిస్తున్నారా?

0
451
ysrcp supporting websites published on jr ntr politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ysrcp supporting websites published on jr ntr politics
మహానాడు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.విశాఖ లో ఘనంగా జరగబోయే ఈ వేడుకల దృష్టిని పక్కకి మళ్లించడానికి ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ లో ఓ భూవివాదం లోకి మంత్రి లోకేష్ పేరు చెప్పి ఏ ఆధారాలు లేకుండానే వైసీపీ నేతలు ఆయన మీద సిబిఐ కి ఫిర్యాదు చేశారు.అయినా ఆ ఆరోపణలకు పెద్దగా మైలేజ్ రాకపోవడంతో వైసీపీ అనుకూల సోషల్ మీడియా కొత్త పల్లవి అందుకుంది. 2019 ఎన్నికల నాటికి లోకేష్ కి పోటీగా ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన చేస్తున్నారని ఓ ప్రచారం మొదలెట్టింది.అందుకు సన్నాహకంగా 2018 మధ్యలో విడుదల అయ్యే ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా సబ్జెక్టు పొలిటికల్ థ్రిల్లర్ అన్న ప్రచారం చేస్తోంది.కొన్నేళ్ల పాటు రాజకీయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ ప్రకటించినా కూడా వైసీపీ అనుకూల సోషల్ మీడియా మహానాడు ముందు ఈ ప్రచారం చేయడం కాకతాళీయం మాత్రం కాదు.

కొన్నేళ్లుగా మహానాడు టైం లో ఏదో ఓ రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన పరోక్షంగా అయినా వచ్చేలా వైసీపీ ప్రయత్నిస్తోంది.ఈసారి ఎన్టీఆర్ స్వయంగా రాజకీయాల గురించి పట్టించుకునేది లేదని చెప్పినా ఈ ప్రచారం మొదలెట్టింది.కుటుంబ ప్రేక్షకుల చూసే సినిమాల జానర్ టచ్ చేసే ఉద్దేశంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి పట్టుబట్టి మరీ ఓకే చేయించుకున్నారు.అలాంటిది ఆయన పొలిటికల్ థ్రిల్లర్ కధాంశం లో నటిస్తాడనేది కేవలం ఊహాగానం మాత్రమే అని ఎన్టీఆర్ సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

Leave a Reply