వైసీపీ లో సర్వే సంబరం…కొమ్మినేని ప్రచారం

  ysrcp survey celebration kommineni spread this news
ఓ విషయానికి అధిక ప్రాధాన్యం వస్తున్నప్పుడు …ప్రత్యర్థికి మైలేజ్ పెరుగుతున్నప్పుడు …ఏ రాజకీయ పార్టీ అయినా ఏమి చేస్తుంది?జనం దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుంది .ఇప్పుడు వైసీపీ వ్యూహకర్తలు అదే పనిలో వున్నారు .కృష్ణ పుష్కర నిర్వహణలో మార్కులు బాబుకి బాగానే పడడంతో వెంటనే ఓ సర్వే అస్త్రాన్ని బయటకి వదిలారు.అయితే అది చేసింది ఎవరో తెలియదు …చేయించింది మాత్రం చంద్రబాబంట.ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది తెలుసుకోవడం సర్వే లక్ష్యమట .

ఆ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెలుగుదేశానికి కేవలం 51 సీట్లు వస్తాయని తేల్చిందట ..దీంతో కంగారుపడ్డ బాబు నానా హైరానా పడిపోతున్నారని కొమ్మినేని సొంతంగా నడిపే వెబ్ సైట్ లో రాశారు.ఇక అది పట్టుకుని వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.ఆ వార్తకి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు .పుష్కర ముగింపు సంబరాలు చూస్తున్న చాలామందికి ఈ వార్త లింక్ సెల్ ఫోన్ ల ద్వారా చేరింది.
అయితే సంబరాలు చేసుకునేవాళ్ళు కానీ ..ఆ వార్తకి ప్రచారం కల్పించిన వాళ్ళు గానీ కొన్ని విషయాల్ని మర్చిపోయినట్టున్నారు .

ఏదైనా సంస్థ సొంతంగా సర్వే తలపెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అన్న కోణాన్ని ఎన్నుకుంటుంది కానీ అధికారంలో వున్నవాళ్లు ..మరో మూడేళ్లదాకా పీఠం మీద కూర్చునే వాళ్ళు తక్షణ ఎన్నికల అంశాన్ని ఆలోచిస్తారా ? ఆ విషయంపై సర్వే చేయిస్తారా? సహజంగా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసే వాళ్ళు ఈపని చేస్తారు.సర్వేలో బాబుకి వచ్చేసీట్లు గురించి మాత్రమే చెప్పి మిగిలిన 124 స్థానాల్ని వదిలేస్తారా ?అవి ప్రతిపక్షానికే దక్కేట్లుంటే సాక్షిలో పనిచేసే కొమ్మినేని ఆ విషయాల్ని దాచిపెడతారా ?వచ్చిన వార్తలు రాయడం వేరు..వండి వార్తలు వడ్డించడం వేరు…రెండో పని చేసేటప్పుడు కాస్త ముందువెనుక చూసుకుంటే మంచిదేమో !

SHARE