పోయినచోటే వెదుక్కుంటున్న వైసీపీ..

 ysrcp take corporation elections very prestigiousఈ ఏడాది చివరి లోపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన వై.ఎస్. విజయమ్మ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో తన జెండాను ఎగరవేసి ప్రతిష్టను కాపాడుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే విశాఖజిల్లాలో ఒకప్పుడు వైసిపికి కీలకంగా ఉన్న నేత కొణతాల రామకృష్ణ, దాడి వీరభధ్రరావు తదితర బలమైన నేతలకు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు.ఈ నేపథ్యంలో ఈ కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. మరీ ముఖ్యంగా విశాఖ పట్నం కార్పోరేషన్‌ను ఆ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది.

గత. కర్నూలుజిల్లాలో బలమైన నేతగా ఉన్న భూమా నాగిరెడ్డి ఆయన కూతురు అఖిలప్రియా సైతం వైసిపిని వీడి టిడిపిలో చేరారు. దీంతో కర్నూలుజిల్లాలో వైసిపి బలం కొంత తగ్గిందన్న ప్రచారం సాగుతోంది. ఇది కూడా కర్నూలు కార్పోరేషన్ ఎన్నికల్లో వైసిపికి సవాల్‌గా మారనున్నదన్న ప్రచారం సాగుతోంది. ఇలా తమ పార్టీలో ఒకప్పుడు బలంగా ఉన్న నేతలను అధికార టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆకర్షించడంపై వైసిపిలో ఆందోళన నెలకొంది.

వీటితోపాటు గుంటూరు, రాజమండి కార్పోరేషన్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ వస్తే దానిపైనా ఇప్పటినుంచే ప్రత్యేక దృష్టిని సారించాలని టిడిపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో సత్తాచాటాలంటే పార్టీకి బూత్ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల ఏర్పాటు జరగాలని, అప్పుడే పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపథంలో తీసుకెళ్లగమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది

ఏపిలో టిడిపి సర్కార్ కొలువుదీరి రెండు న్నరేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజాసమస్యలపై పోరుతో జనంలో పట్టుసాధిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది. ఇద్దంతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే సాధ్యమన్న నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిస్థాయిలో విజయవతంచేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని తేలికగా తీసుకోకూడదని ఇప్పటికే హెచ్చరించింది. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కమి టీల నియామకానికి కృషిచేయండి అని పార్టీ శ్రేణులకు ఆయన ఆదేశించారు.

స్థానిక కమిటీలను వేసే బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు నియోజకవర్గ సమన్వకర్తలపై, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై ఆయన పెట్టారు. ఏపీ రాష్ట్రంలో ఆరు కార్పోరేషన్, ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు ద్వారానే సాధ్యమవుతోందన్న భావన వైసిపిలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా స్థానిక కమిటీలు సైతం ప్రభావాన్ని చూపుతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.ఇప్పటికే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలం అవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వానికి ఓ రకంగా ఏపీలో పెండింగ్‌లో ఉన్నా కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలు పెనుసవాల్‌గా పరిణమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటడం బట్టే పార్టీ భవిష్యత్తు నిర్ధారణ అవుతుందన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది. కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఒకోక్కరుగా టిడిపిలోకి వెళ్తున్నారు, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా ప్రచారం సాగుతోంది. ఇలాంటి ఆలోచన పార్టీ ఎమ్మెల్యేలలో రావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది ఒక కారణమైతే పార్టీ అధినేత తీరు మరో కారణంగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ అధినేత సమర్థతకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. . గడప గడపకు వైసిపి కార్యక్రమం ద్వారానే పార్టీ క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని వై.ఎస్.జగన్ పార్టీ జిల్లా అధ్యక్షులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

SHARE