ఆ స్మార్ట్ హీరో వైసీపీ కి విలన్?

0
653
ysrcp websites scold to madhavan because he praise to cm chandrababu

Posted [relativedate]

ysrcp websites scold to madhavan because he praise to cm chandrababu
పేరుకి తమిళుడైనా తన సినిమాలతో దేశమంతా తెలిసిన హీరో మాధవన్. ఈయనకి నటనతో పాటు కాసింత సామాజిక స్పృహ కూడా వుంది.విశాలభావాలకు ప్రతినిధిగా నేటి తరం ఆలోచనలకి సరిపోయినట్టుంటాడు.మనసులో వున్నది బయటికి చెప్పేస్తాడు.ఎవరికీ భయపడడు.ఆ పర్యవసానాలని పెద్దగా పట్టించుకోడు.జల్లికట్టు,స్త్రీ సమస్యలు..ఇలా ఈతరాన్ని కదిలించే ఏ అంశం మీదైనా మాట్లాడే అలవాటున్న హీరో కి కొన్ని రాజకీయ అభిప్రాయాలు కూడా వున్నాయి.అందుకే కాబోలు ఏపీ సీఎం చంద్రబాబుని తన అభిమాన రాజకీయ నాయకుడిగా పేర్కొంటూ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టాడు.”ఫ్యూచర్ డేకోడెడ్ ” పేరిట మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఓ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కూడా ఆ పోస్ట్ కి యాడ్ చేసాడు.ఓ రాజకీయ నాయకుడు టెక్నాలజీ మీద,భవిష్యత్ మీద ఓ విజన్ తో ప్రసంగించడం మాధవన్ ని ఆకట్టుకుని ఉంటుంది.భారత రాజకీయాల్లో ఇలాంటి దృశ్యాలు కొత్త కాకపోయినా కాస్త అరుదే.అందుకే మాధవన్ బాబుకి బూస్ట్ ఇచ్చే కామెంట్స్ చేసాడు.సహజంగానే దీన్ని టీడీపీ హైలైట్ చేసుకుంది.ఇంకేముంది…వైసీపీ కి చిర్రెత్తుకొచ్చింది.ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియాకి అయితే ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినట్లు అయింది.

మాధవన్ కి మతి వుండే ఈ పని చేశాడా ?అని వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది.అంతే కాదు ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏదో ఆర్ధిక ప్రయోజనాలు ఆశించి ఈ పని చేస్తున్నాడని బురదజల్లేసింది.అసలు ఆయనకు ఏపీ రాజకీయాల గురించి ఏమి తెలుసంటూ నిలదీసింది.నిజమే …ఆయనకు నిజంగానే ఏపీ రాజకీయాల గురించి తెలిసి ఉండకపోవచ్చు.అమెరికా అధ్యక్షుడు నుంచి ఆవకాయ పచ్చడి దాకా దేని మీద అయినా జోరుగా హుషారుగా కామెంట్ చేస్తున్న తెలుగు సోషల్ మీడియాకి మాత్రం ఏమి తెలుసు ? కొందరు వ్యక్తులు తమ అభిప్రాయాల్ని పంచుకోడానికి సోషల్ మీడియాని వేదిక చేసుకున్నారు.అదృష్టవశాత్తు అందులో వ్యాపార ప్రయోజనాలు కూడా ఇమిడిపోవడంతో ఇంకాస్త ఆసక్తిగా వెబ్ సైట్స్ రన్ చేస్తున్నారు.అలాగే ఓ సమూహంగా కాకపోయినా ఓ వ్యక్తిగా తన కున్న అభిప్రాయాల్ని పంచుకున్నందుకు దేశమంతా అలరిస్తున్న ఓ నటుడిని పట్టుకుని మతి ఉందా అని ప్రశ్నించడం ఎంత సభ్యత,సంస్కారమో ఆలోచించుకోవాలి.ప్రకృతి,కాలం,జనం మనకు నచ్చినట్టు వుండవు ..వుండరు.వారికి తగినట్టు మనమే ఉండాలి.అది మరిచిపోతే కాలమే సమాధానం చెబుతుంది.ఇక్కడ మేము లేవనెత్తుతున్న ప్రశ్న,అంశం చంద్రబాబు టాలెంట్ మీద కాదు.ఆయన్ని పొగడ్డం తప్పని ఓ వ్యక్తిని నిందించడం మీద..

madhavan tweets about ap cm chandrababu

Leave a Reply