తమిళ రాజకీయాల్లో తలైవా ఎంట్రీ?

Posted February 10, 2017

rajinikanth political entryతమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి  పన్నీర్ సెల్వం మూడు రోజుల క్రితం చిన్నమ్మ శశికళ గురించి చేసిన వ్యాఖ్యలతో తమిళ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా తమిళుల ఆరాధ్య నటుడు రజినీకాంత్  రాజకీయాల్లోకి తలదూర్చే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ విషయమే  చర్చనీయాంశంగా మారింది.

ఈ రోజు సాయంత్రం రజినీ తన సన్నిహితులతో కలిసి భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీకి  RSS  సిద్దాంతకర్త గురుమూర్తి కూడా హాజరవ్వడంతో ఈ  మీటింగ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో రాజకీయాల్లోకి రజినీ   ఎంట్రీ ఇవ్వడానికి పావులు కదుపుతున్నారని, ఆయన ఖచ్చితంగా వస్తాడని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

రజినీకి, బిజేపీకి సత్సంభాదాలు ఉండడంతో ఆయన  బిజీపీలో చేరుతారని అందరూ అనుకుంటున్నారు. కానీ సొంతం పార్టీతోనే  రజినీ.. రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తమ అభిమాన హీరో తలైవా రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతున్నారని, వారి కోరికను నెరవేర్చేందుకు ఇది అనువైన సమయంగా రజినీ భావిస్తున్నారని తెలుస్తోంది.

నిజానికి రజినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఆయన సోదరుడు గతేడాది అమ్మ చనిపోయిన తర్వాత వెల్లడించాడు. రజినీ సొంతపార్టీ పెట్టనున్నాడన్న హింట్ కూడా ఆయన అప్పుడే ఇచ్చేశాడు. కాబట్టి రజినీ ఖచ్చితంగా రాజకీయల్లోకి వస్తాడని, తమ సమస్యలను పరిష్కరించనున్నాడని తమిళవాసులు అభిప్రాయపడుతున్నారు. మరి తలైవా ఏం చేయనున్నాడో చూడాలి.

SHARE