సక్సెస్…దీనికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెప్తారు.ఎవరి కోణం వారిది.కానీ కొన్ని కామన్ విషయాలుంటాయి.అవేంటో మీరే చదవండి..
4 ఏళ్ల వయసులో సక్సెస్ …బట్టల్లోమూత్రం పోసుకోకుండా ఉండటం 8 ఏళ్ల వయసులో సక్సెస్ …ఇంకోరి తోడు లేకుండా ఇంటికెళ్ళడం 12 ఏళ్ల వయసులో సక్సెస్ ….స్నేహితులు ఉండటం 18 ఏళ్ల వయసులో సక్సెస్ …..డ్రైవర్ లైసెన్స్ ఉండటం 23 ఏళ్ల వయసులో సక్సెస్ …..డిగ్రీ కలిగివుండటం 25 ఏళ్ల వయసులో సక్సెస్ …..ఉద్యోగం సంపాదించడం 30 ఏళ్ల వయసులో సక్సెస్ …..మంచి కుటుంబం ఉండటం 35 ఏళ్ల వయసులో సక్సెస్ ……డబ్బు సంపాదించడం 45 ఏళ్ల వయసులో సక్సెస్ …..వయసు కనపడకుండా ఉండటం 50 ఏళ్ల వయసులో సక్సెస్ ….పిల్లలకి మంచి చదువు చెప్పించడం 55 ఏళ్ల వయసులో సక్సెస్ ….కుటుంబ,ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా చూడటం. 60 ఏళ్ల వయసులో సక్సెస్ ….సక్రమంగా డ్రైవింగ్ చేయగలగడం 65 ఏళ్ల వయసులో సక్సెస్ ….ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉండటం 70 ఏళ్ల వయసులో సక్సెస్ …..ఎవరికీ బరువు అనిపించకపోవడం 75 ఏళ్ల వయసులో సక్సెస్ ….పాత స్నేహితుల్ని కలిగివుండటం 80 ఏళ్ల వయసులో సక్సెస్ ….ఎవరి సాయం లేకుండా ఇంటికి తిరిగెళ్ళడం 85 ఏళ్ల వయసులో సక్సెస్ ….బట్టల్లో మూత్రం పోసుకోకుండా ఉండటం
చూసారుగా సక్సెస్ అనేది ఎంత సాపేక్షమో..దాని చుట్టూ పరిగెత్తడమా?జీవితాన్ని ఆస్వాదించడమా? మీరే తేల్చుకోండి.
పుట్టిన ప్రతి మనిషి జీవన పోరాటం చేయాల్సిందే..ఆ పోరాటానికి సహకరించే 6 గురు బంధువులు….చెడగొట్టడానికి ప్రయత్నించే 10 మంది శత్రువులు సిద్ధంగా వుంటారు.వాళ్లెవరో తెలుసుకోవాలని ఉందా?ముందుగా బంధువులెవరో చూడండి… 1.సత్యమే తల్లి 2.జ్ఞానమే తండ్రి 3 . ధర్మమే సోదరుడు 4.దయే స్నేహితుడు 5.శాంతే భార్య 6.ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురు బంధువులతో మంచిగా ఉంటే జీవనపోరాటం సులభమవుతుంది.ఇక మన పోరాటానికి అడ్డుగా నిలిచి ఓటమిపాలు చేసే 10 మంది శత్రువులున్నారు.వారితో జాగ్రత్తగా ఉండాలి..వాళ్లెవరో చూద్దాం.. 1.కామం 2.క్రోధం 3 . మోహం 4.లోభం 5.మదం 6.మాత్సర్యం 7.స్వార్ధం 8.అన్యాయం 9. అమానుషత్వం 10.అహంకారం ఈ పదిమంది శత్రువుల్ని దరి చేరనిస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే .
ప్రతి మనిషిలో రాముడు ,రావణుడు ఇద్దరూ వుంటారు.ప్రతి మనసులో రాజు,బంటు కలిసే వుంటారు.మనం ఒకరిని పోషిస్తాం.మరొకర్ని తొక్కేస్తాం.కానీ బతుకు చిత్రాన్ని సుందరంగా మలచుకోవడం కంటే..భయం గుప్పిట్లో బతుకునే ఓ శత్రువుగా భావించే సమాజాన్ని సృస్టిస్తున్నాం.అది సరికాదంటూ ఓ అజ్ఞాత కలం మనలో రాజుని నిద్రలేపే ప్రయత్నం చేసింది.జీవిత సారాన్ని స్ఫూర్తిదాయక అక్షరాల్లో పొదిగిన ఆ కలం వీరుడికి జేజేలు చెప్తూ అయన మాటని పదిమందికి చేర్చే ప్రయత్నమే ఇది ..
ఒకరోజు విందుభోజనం చేస్తావు, ఇంకోరోజు అడుక్కుతింటావు – పాండవుల్లా…!
ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు, మరో రాత్రి చలికి వణికిపోతావు- శ్రీరాముడిలా…!
ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో… రెండింటి నుండి ఎంతో కొంత తీసుకో…!
రాజంటే స్టానం కాదు రాజంటే స్థాయి… స్థానం – భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి – మానసికం, మనసుకు తెలుస్తుంది…! మనందరిలో ఒక రాజుంటాడు… బ్రతికిస్తావో, చంపేసుకుంటావో నీ ఇష్టం!
జ్ఞానం.. ధనం… విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు, వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు?ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది! ముగ్గురు ఆలోచించసాగారు!
ఇంతలో జ్ఞానం అంటుంది.. ‘దేవాలయాలు.. విద్యాలయాల్లో నేను కలుస్తా’ అన్నది! విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది! కారణమేంటని జ్ఞానం.. ధనం అడిగారు..
అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది.. ‘మీరిద్దరూ విడిపోయినా.. వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు’ అన్నది!
విశ్వాసం మాటల్ని విని.. జ్ఞానం , ధనం ఆశ్చర్యపోయాయి! స్నేహం పట్ల.. విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాల్ని మెచ్చుకున్నాయి! నీతి: ధనం ఎప్పుడైనా వస్తాయి. కానీ విశ్వాసం ఒక్కసారిపోతే మళ్ళీ రాదు!
సరిహద్దులో టెన్షన్ పెరుగుతుంటే … సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే… నెటిజన్లు కూడా తమ సృజనకు పదును పెట్టి మరీ పాక్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలా ఓ బుర్రలో పుట్టిన మీకోసం..
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ మీద పాక్ అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయిస్తే … పాక్ కోర్టులో ఇండియా మీద చేసే ఫిర్యాదులేమిటో తెలుసా?
1.సర్జరీ చేయడానికి ఇండియా ముందస్తు అనుమతి తీసుకోలేదు
2.సర్జరీ కి ముందు కౌన్సిలింగ్ ఇవ్వలేదు
3 .సర్జరీ కి ముందు మత్తుమందు ఇవ్వలేదు
4.సర్జరీ తర్వాత చేయాల్సిన పనులు గురించి చెప్పలేదు
5. ఆపరేషన్ చేసే వాళ్ళు దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధం
6.అమెరికా బీమా క్లెయిమ్ కి ఒప్పుకోవడం లేదు.
ఇలా… వాదిస్తుందట పాపం పాక్..
ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవుతాయట. దీంతోమన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట.
ఆడవారు గాజులు ధరించడం వెనుక…
ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట.
పిల్లలకు చెవులు కుట్టించడం…
చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.
రావి చెట్టును పూజించడం…
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.
కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం…
హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట.
భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒక వేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయట. కాబట్టి తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదట.
నుదుటన కుంకుమ బొట్టు ధరించడం…
నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.
ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం…
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట.
నేలపై కూర్చుని భోజనం చేయడం…
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.
కారమైన ఆహారం ముందు, స్వీట్లు తరువాత తినడం…
భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణంచేయనీయదట.
నదుల్లో నాణేలు వేయడం…
ఒకప్పుడు మన దగ్గర రాగితో చేసిన నాణేలు చలామణీలో ఉండేవి. ఈ కారణంగా ఆ నాణేలను నదుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేదట. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూరమయ్యేవట.
ఉపవాసం ఉండడం…
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా.ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్ట బడతాయట. దీంతోపాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావట!!!
ఏకవింశతి పత్రాల గురించి తెలుసుకుందామా ..?
వినాయక చవితి నాడు చేసే పూజలో
ప్రధానమైనవి
పత్రాలు. విఘ్నేశ్వరుని
21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.
అయితే ఈ 21 ఆకుల
పేర్లు అర్ధంగాక చాలామంది
వీటిని సరిగా గుర్తించలేకపోతారు.
అలాగాక
వీటిపై
అవగాహన ఉంటే వాటిని
సులువుగా గుర్తించవచ్చు. ఆ వివరాలను తెలుసుకుందాం.
1. మాచీ పత్రం: మాచ
పత్రి అనేది తెలుగు
పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
2. దూర్వా పత్రం:
దూర్వా పత్రం
అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు
రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత
ప్రీతికరమైనవి.
3. అపామార్గ
పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా
వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
4. బృహతీ పత్రం: దీనిని ములక
అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక
అని రెండు రకాలున్నాయి. పత్రాలు
వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో
వుంటాయి.
5. దత్తూర పత్రం: దుత్తూర
పత్రం అంటే ఉమ్మెత్త. ఇది
వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు
పూలు వుంటాయి.
6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
పనిలేదు. తులసీ పత్రాలను
దేవతార్చనలో వాడతారు.ఈ
ఒక్కరోజే
వాడాలి.
7. బిల్వ పత్రం:
బిల్వ పత్రం
అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా,
ఒక ఆకుగా ఉంటాయి.
ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా
చెపుతారు.
8. బదరీ పత్రం: బదరీ
పత్రం అంటే రేగు. దీనిలో రేగు,
జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
9. చూత పత్రం: చూత
పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో
విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం
పండుగరోజులలో కనిపించదు.
10. కరవీర పత్రం: దీనినే గన్నేరు
అంటారు. తెలుపు,
పసుపు,
ఎరుపు రంగుల
పూలుంటాయి. పూజలో ఈ
పూలకు విశిష్ట స్థానం ఉంది.
11. మరువక పత్రం: దీన్ని
వాడుక భాషలో ధవనం, మరువం
అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన
వెదజల్లుతుండటం ఈ పత్రం
ప్రత్యేకత.
12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ
పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు
ప్రత్యేక పూజలు
నిర్వహిస్తారు.
13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం,
తెలుపు
పువ్వులుండే చిన్న మొక్క. నీలి
పువ్వులుండే రకాన్ని
విష్ణుక్రాంత అంటారు.
14. సింధువార పత్రం:
సింధువార పత్రాన్నే వాడుకలో
వావిలి అనికూడ
పిలుస్తుంటారు.
15. అశ్వత్థ
పత్రం: రావి ఆకులనే
అశ్వత్థ
పత్ర మంటారు. రావి చెట్టుకు
పూజలు చేయటం మనసంప్రదాయం.
16. దాడిమీ పత్రం: దాడిమీ
అంటె దానిమ్మ ఆకు. శక్తి
స్వరూపిణి
అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
17. జాజి పత్రం: ఇది సన్నజాజి
అనే మల్లిజాతి మొక్క. వీటి
పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
18. అర్జున
పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున
పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని
పోలి వుంటాయి.
అడవులలో
పెరిగే పెద్ద
వృక్షం ఇది.
19. దేవదారు పత్రం:
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా
ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు
సహజత్వం ఉంటుంది.
20. గండకీ పత్రం: దీనినే లతాదూర్వా
అనికూడా అంటారు.
భూమిపైన తీగమాదిరి పాకి
కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.
21. అర్క
పత్రం: జిల్లేడు ఆకులను అర్క
పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన
వినాయకప్రతిమను
పూజించడం వల్ల విశేష ఫలం
వుంటుందంటారు.
కేవలం మట్టి వినాయకులను పూజించండి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్
విగ్రహాలను వాడకండి.
విచిత్ర ఆకృతిలో ఉన్న వినాయకవిగ్రహాలను వ్యతిరేకించండి. హిందూమతాన్ని
కాపాడండి
ఆపిల్ కంపెనీ సృష్టికర్త, ప్రపంచ మేధావుల్లో ఒకరైన “స్టీవ్ జాబ్స్” ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు
వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే,ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .
ఈ నిశిరాత్రిలో …నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడనిపిస్తోంది…జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక, మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ………. ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది . కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది . అందుకు నేనే ఉదాహరణ .
ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు . నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు . నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలు మాత్రమే . ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .
నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?…….. నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు . నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు . నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .
జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా – కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది . అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .అందుకే …, కాస్త ముందే కళ్ళు తెరువు .డబ్బును కాదు ,నీ కుటుంబాన్నిప్రేమించు . నీ స్నేహితులను ప్రేమించు .ఆనందంగా జీవించు..
వినాయక చవితి పండగ లో మనము తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు చేస్తున్నాము. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు. వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని ఇలా ఎందుకు పూజిస్తున్నారు. ” ఈగ గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్ మాన్ గణపతి బుల్లెట్ గణపతి …ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి దుర్మార్గపు కృత్యాలు ..? కాలని లోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్లి తండ్రులు , నాయకులు ఇలాంటివి చూసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు….? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ..?
మన బుద్ధి రాను రాను వక్రీకరించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది. ఇక నవరాత్రులు చివరి రోజు మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం – దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు ,భయకరమైన సౌండ్ సిస్టం ,ఇలా ప్రతీది తప్పె,
అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు . మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి. మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం… అన్నీ వికృత చేష్టలే . చాలా జాగ్రత్తగా గమనించండి….1 మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .
దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కతిని కాపాడే బాధ్యత మనలో లేకపోతే మనం బతికున్న శవాలమే… ఆలోచించండి.