మహేష్ అంటే ? .

0
616

 prince mahesh
బర్త్ డే బాయ్ ..ఒక వయసు వచ్చాక ఆ బాయ్ అనే మాట ఎంత ఇబ్బందిగా ఉంటుందో ?కానీ ఇలాంటి ఇబ్బందులు ,వయసుతో పాటు వచ్చే అంకుల్ పిలుపులు అతన్ని తాకవు.అతనే మహేష్ బాబు ..అందుకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా హీరోయిన్ లందరికీ అతనే మోస్ట్ వాంటెడ్ హీరో ..పైకి కనిపించినట్టు మహేష్ అంటే కేవలం అందం,స్టార్ డం,హిట్లు ఇది మాత్రమే చూస్తే ఆయన్ను తక్కువ చేసినట్టే ..పైకి కనిపించే వాటి వెనుకున్న మహేష్ కృషి ,పట్టుదల ,వ్యక్తిత్వం వెలకట్టలేనివి .

ఓ స్టార్ హీరో ఇంట్లో పుడితే హీరో కావడం ఎంత తేలికో ఆ ముందు స్టార్ తెచ్చుకోవడం అంత కష్టం. అందుకు ఎన్నో ఉదాహరణలు ..స్వయంగా ఇంట్లోనే అన్నయ్య రమేష్ వైఫల్యంకన్పిస్తూనే వుంది …అందుకే మహేష్ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు . . మహేష్ సినిమాలు ఫెయిల్ అయ్యాయేమోగానీ అందులో పాత్రలు ఎప్పుడూ లాజిక్ లేకుండా ముందుకెళ్ళలేదు .కుటుంబ నేపధ్యం వుంది కదాని భారీ డైలాగ్ లు ,చిత్ర విచిత్ర పోరాట సన్నివేశాలు చేయలేదు .వయసుకి తగినట్టే తొలి దశలో ప్రేమకథలు,పరిణితి వచ్చే కొద్దీ దానికి తగ్గ పాత్రలే మహేష్ ఎంచుకొంటూ వచ్చారు.ఒక్కసారి స్టార్ డం వచ్చాక కూడా మూలాల్ని మరువలేదు మహేష్ .

ఇక రంగురంగుల సినీ ప్రపంచం విసిరే వల గురించి అందరికీ తెలుసు .ఎందరో కుర్రోళ్ళు ఆ వల్లో పడి జీవితాల్ని నాశనం చేసుకున్నారు .చిన్న వయసులోనే సినీ రంగంలో అడుపెట్టినా మహేష్ గురించి ఒక్క పుకారు బయటకు రాలేదు .ప్రేమించిన నమ్రతానే పెళ్లి చేసుకున్నారు .ఆమె ఇచ్చిన ఓ పుస్తకం చదివి చైన్ స్మోకర్ కాస్తా సిగరెట్ వాసన పడనంత దూరంగా వెళ్లిపోయారు .ఇది ఎంత కష్టమో వ్యసనాల బారిన పడ్డ ఎవరిని అడిగినా చెప్తారు .చిన్న వయసులోనే మహేష్ ఎంత స్వీయనియంత్రణ పాటిస్తారో చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే .

మహేష్ బాబు… టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు…ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే తీరు కూడా చాలా పర్ ఫెక్టుగా ఉంటుందని అంటుంటారు. సినిమా వ్యవహారాలు, సంపాదన, కుటుంబ వ్యవహారాలు, అభిమానులతో ఆయన డీల్ చేసే వ్యవహారం, సేవా కార్యక్రమాల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి, అంకిత భావం, ఫిట్‌నెస్ విషయంలో మహేష్ బాబు తీసుకునే శ్రద్ధ ప్రశంసనీయం. సేవా తత్పరతలో ఆయన చాలా మందికి రోల్ మోడల్ అయ్యారు.

ప్రతి ఒక్కరూ కోరుకునేలా…. సమాజంలో జీవిచడం, ఓ స్థాయికి రావడం, పర్‌ఫెక్టుగా లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడం… దీంతో పాటు సింపుల్ లైవ్ స్టైల్ లాంటివి మహేష్ బాబు లాంటి కొందరు స్టార్లకు మాత్రమే సాధ్యం అంటున్నారు ఆయన అభిమానులు.ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్‌బాబు మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడమే ఓ గొప్ప. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ణ్యా సినిమా హిట్టయితే భారీ లాభాలు వస్తాయనేది నిర్మాతల నమ్మకం.మహేష్ వ్యక్తిత్వం, ఆటిట్యూడ్… ఆయన ఇతర స్టార్లతో వ్యవహరించే తీరు కూడా చాలా గొప్పగా ఉంటుందని ఆయన కోస్టార్స్ అంటుంటారు.

మహేష్ బాబు సంపాదన విషయంలో కూడా తెలుగు స్టార్ హీరోల్లో టాప్. ఆయనకు ఒక్కో సినిమాకు రూ. 20 నుండి రూ. 30 కోట్లు తీసుకుంటారు. ఇవీ కాక బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం అదనం.నేడు ఈ సినీ రాజకుమారుడి పుట్టినరోజు. ప్రిన్స్ మహేష్‌బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం…

Leave a Reply