డీటీహెచ్ పెట్రోల్

0
541
Liter Petrol And Diesel Prices Reduced By 80Rs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేబుల్ సర్వీసున తలదన్నేలా డైరక్ట్ టు హోమ్ ప్రసారాలు వివిధ సంస్థలు ఇప్పటికే అందిస్తున్నాయి. ఇప్పుడు ఇంధన రంగంలోనూ డీటీహెచ్ సేవలు మొదలవబోతున్నాయి. ఇప్పటిదాకా పెట్రోల్ కావాలంటే మనం పెట్రోల్ బంక్ కు వెళ్లి,, అక్కడ ఓపిగ్గా క్యూలో ఎదురుచూసి, బంక్ సిబ్బంది విసుగును భరించి పెట్రోల్ పోయించుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆ బాథలకు సెలవు చెప్పొచ్చట. ఎంత ఆర్డర్ ఇస్తే అంత పెట్రోల్ ఇంటికే డెలివరీ వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. పైగా పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ లు ఉండవు. వినియోగదారులకు కూడా చాలా టైమ్ మిగులుతుంది.

ప్రస్తుతం డీటీహెచ్ పెట్రోల్ అనే విషయం ప్రతిపాదన దశలోనే ఉంది. అయితే సంస్కరణలకు పచ్చజెండా ఊపుతున్న కేంద్రం.. దీనికి కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు. డైరక్ట్ టు హోమ్ పెట్రోల్ కారణంగా అటు బంక్ యజమానులకు, ఇటు వినియోగదారులకు లాభమేనని ప్రపోజల్ తెచ్చిన నిపుణులు చెబుతున్నారట. టైమ్ సేవ్ కావడం, అమ్మకాలు పెరగడం ఉంటుందని, ఏరియాల వారీగా బంక్ తన వినియోగదారుల్ని స్టాండర్ట్ గా ఉంచుకోవచ్చని, కేబుల్ ఏరియాల్లాగే, పెట్రోల్ బంక్ ఏరియాలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 59వేల 595 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజూ మూడున్నర కోట్ల మంది వినియోగాదరులు ఇంధనం కోసం వెళుతున్నారని అంచనా. రద్దీ సమయాల్లో వాహనాదారుల గంటల కొద్దీ ఎదురుచూసి పెట్రోల్ పోయించుకోవాల్సి వస్తోంది. ఇంధనం కోసం వ్యయప్రయాసలను తగ్గించే ఉద్దేశంతో ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటికే పెట్రోల్ సరఫరా చేస్తే ఎలా ఉంటుందన్న విషయం పరిశీలన జరుగుతోంది. అయితే కేబుల్ వ్యాపారం లాగే ఇక్కడ కూడా సర్వీస్ ఛార్జ్ పేరుతో కళ్లు చెదిరే వసూళ్లు ఉంటాయోమేనన్న ఆందోళన కూడా ఉంది.

Leave a Reply