బాబు బంగారం రివ్యూ …

0
552

 babu bangaram review

చిత్రం : బాబు బంగారం (2016)
న‌టీన‌టులు : వెంక‌టేష్‌, న‌య‌న‌తార
సంగీతం : జిబ్రాన్‌
డైరెక్టర్ : మారుతి
నిర్మాత : సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ- పీడీవీ.ప్ర‌సాద్‌
రిలీజ్ డేట్‌ : 12 ఆగ‌స్టు, 2016
రేటింగ్ – 2.75/5

(వినోదం కావాలా.. విక్టరీ వెంకటేష్ సినిమాకి వెళ్లండి సెంటిమెంట్..  విక్టరీ వెంకటేష్ సినిమాకి వెళ్లండి లవ్ ..  వెంకీ సినిమాకి వెళ్లండి యాక్షన్..   వెంకీ సినిమాకి వెళ్లండి) ఇవన్నీ కలిపి కూడా ఒకే సినిమాలో చూడాలని ఉందా.. ? అప్పుడు కూడా వెంకీ సినిమాకే వెళ్లండి. వినోదం పండించడంలోనూ, కుటుంబ భావోద్వేగాలు
ఆవిష్కరించడంలోనూ వెంకీది ప్రత్యేకమైన శైలి. ఫ్యామిలీ ప్రేక్షకులు ఏమాత్రం తడుముకోకుండా వెళ్లే సినిమా కూడా వెంకీదే. పెద్దోళ్లు, చిన్నోళ్లు, వయసొచ్చినోళ్లు, వయసు మళ్లినోళ్ళు.. అంటూ తేడా లేకుండా వెంకీ సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. గత 30యేళ్లుగా వెంకీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెడుతూనే ఉన్నాడు. ఇమేజ్ చక్రంలో ఇరుక్కోని నటుడు కూడా వెంకీనే. హీరో డ్యామినేషన్ కొనసాగుతున్న టైం.. హీరోయిన్ పేరుతో టైటిల్ పెట్టి సినిమా తీసిన క్రెడిట్ కూడా వెంకీదే. మొత్తానికి.. వెంకీ అన్నిరకాల ప్రేక్షకులని అన్ని రకాలుగా సంతృప్తి పరిచే బంగారంలాంటి హీరో.

ఇప్పుడీ బంగారంలాంటి హీరో “బాబు బంగారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార జతకట్టనుంది. సంగీతం జిబ్రాన్‌. ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఎప్పటిలాగే వెంకీ మార్క్ కామెడీతో పాటుగా మాస్ కి
నచ్చే ఎలిమిట్స్ తో ‘బాబు బంగారం’ని తీసుకొచ్చారు మారుతి. ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బాబు బంగారం’ ప్రేక్షకులని అలరించాడా.. ? నిజంగానే బాబు బంగారమేనా తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
కృష్ణ (వెంకీ) అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌. మ‌నోడి ఎడిష‌న‌ల్ క్వాలిఫికేష‌న్ జాలి. సున్నిత‌త్వానికే అమ్మ‌మ్మ లాంటోడు. తనలాగే జాలిగుణం గల గల శైలజ (నయనతార ) చూసి మనసుపారేసుకొంటాడు. ప్రేమిస్తానని వెంటపడుతున్న కృష్ణని శైలజ దూరం పెడుతుంటుంది. శైలజ తండ్రి మురళి శర్మ. ఐటీ (ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్) డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఓ పొలిటిక్ లీడర్ ఇంట్లో జరిగిన సోదాల్లో పాల్గొన్న శర్మకి ఓ వీడియో దొరుకుతుంది. అందులో కొన్ని రహస్యాలు ఉండటంతో తన దగ్గరే ఉంచుకొంటాడు. ఈ విషయం తెలిసిన రౌడీ బ్యాచ్ శర్మని ఓ హత్యలో ఇరిక్కించి.. అరెస్ట్ కావడానికి కారణం అవుతుంది. ఇంతకీ.. ఆ వీడియో ఉన్న రహస్యం ఏంటీ ? శైలజ కృష్ణని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* వెంకటేష్
* కామెడీ
* స్క్రీన్ ప్లే
* ఎమోషన్స్
* 30 ఇయర్స్ పృధ్వీ

మైనస్ పాయింట్స్
* సాగదీత
* ముందే  ఊహించే కథ

నటీనటుల పెర్ ఫామెన్స్ :
వెంకీ ఫ్యామీలీ టైపు. మారుతి యూత్ (బూతు) టైపు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే.. ఏ మూలనో ఓ డౌటు కొట్టింది. మారుతి వెంకీని డీల్ చేయగలడా
? అనే అనుమానాలు కలిగాయి. కానీ, ‘భలే భలే మగాడివోయ్’తో మారుతి మారాడులే అని వెంకీ ఫ్యాన్స్ సర్థి చెప్పుకొన్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ ఆ కాస్త
డౌటుని తూడ్చిపెట్టేశాడు మారుతి. ఇక, ఈరోజు సినినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్ ఖుషి. వెంకీని భలే చూపించాడు అనేస్తున్నారు. వెంకీకి వాడుకోవడంలో
మారుతి సక్సెస్ అయ్యాడు. ఇక, వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిందేముంది. ఎప్పటిలాగే ఇరగొట్టేశాడు. కామెడీ టైమింగ్, యాక్షన్ లోనూ ఇరగదీశాడు. క్లైమాక్స్ లో బొబ్బొలిరాజా మేనరిజంతో కేకపుట్టించాడు. వెంకీ-నయనతార లది హిట్ జోడీ. పైగా ఈ సినిమాలో నయన్ చాలా సన్నగా, క్యూట్ గా కనిపించింది. ఏమోషనల్ సీన్స్ లో తనదైన మార్క్ ని చూపించింది. వెంకీ, నయన్ ల తర్వాత కచ్చితంగా చెప్పుకోదగ్గ పాత్ర 30ఇయర్స్ పృథ్వీది. ‘బత్తాయి బాబ్జీ’ గా నవ్వులు పూయించాడు. వెన్నల కిషోర్, బ్రహ్మానందం లు ఉన్నా.. వారి నుంచి పెద్దగా నవ్వులు పండలేదు. మిగితా నటీనటులు వారి వారి పరిథిల్ పర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం :
సాంకేతికంగా వెంకీ సినిమాలు ఎప్పుడూ రిచ్ గా ఉంటాయి. బాబు బంగారం కూడా అదే రేంజ్ లో ఉంది. జిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య
సంగీతం ట్రెండ్ కి తగ్గట్టుగా సాగింది. లొకేషన్స్ ని సెలక్ట్ చేసుకోవడంలో మంచి టేస్ట్ కనబడుతోంది. ఇక, సినిమా సెకండాఫ్ లో కాస్త కత్తెర పెడితే బాగుణ్ను. అప్పటివరకు సరదాగా సాగే కథ.. ఒక్కసారిగా సిరీయస్ మూడ్ లోకి వెళ్లేసరికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా రిచ్ గా వచ్చింది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
మొత్తంగా.. బాబు బంగారం వెంకీ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్  టైనర్. ఓ గంటపాటు వెంకీమార్క్ కామెడీ, మరో గంటపాటు వెంకీ మార్క్ ఎమోషన్, యాక్షన్
చూడాలంటే.. బాబు బంగారం థియేటర్స్ వైపు బంగారంలా వెళ్లొచ్చు.

బాటమ్ లైన్ : బాబు బంగారం.. ‘బంగారంలాంటి కామెడీ’ ఎంటర్ టైనర్.. !

Leave a Reply