పెళ్లి చూపులు.. రివ్యూ

0
1026
pelli chupulu review

pelli chupulu review
టైటిల్ : పెళ్లి చూపులు (2016)
నటీనటులు : విజయ్ దేవర కొండ, రీతూ వర్మ
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని
విడుదల తేదీ : 29 జూలై, 2016

ఓ వ్యక్తి.. వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టం పెళ్లి. అయితే, పెళ్లికి ముందు జరిగే పెళ్లిచూపులు భలే థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఓ వైపు టెన్షన్మరోవైపు జీవిత భాగస్వామి చూడబోతున్నామన్న ఆతృత..  మొత్తానికి పెళ్లిచూపుల ఏపీసోడ్ పెళ్లి ఘట్టంలోనే హైలైట్ నిలిచిపోవడం ఖాయం. ఇక, ఈ తరం పెళ్లి చూపుల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడీదే టైటిల్ తో.. ఓ సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవర కొండరీతూ వర్మ జంటగా నటించారు. సంగీతం వివేక్ సాగర్. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (జులై29) ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే.. యూఎస్ లో ఇప్పటికే బినిఫిట్ షోలు పడిపోయాయి. ఓ స్పెషల్ ప్రివ్యూ చూశాక ఈ సమీక్షను మీకందిస్తున్నాం.

కొత్త దర్శకుడు, నటీనటులు కూడా దాదాపు కొత్తవారే. హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఇది రెండో సినిమా. (ఇంతకు ముందు నాని “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించాడు) టైటిల్ “పెళ్లి చూపులు” సాంప్రదాయం కలిగినది. అయితే, నేటి తరం పెళ్లి చూపులుజరిగే విధానాన్ని, నేటి యువత ఆలోచనల విధానాన్ని వినియోగించుకొని దర్శకుడు మ్యాజిక్ చేసే ఛాన్సుంది. వాస్తవికతకు దూరం కాకుండా, ఈతరం ఆలోచనలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎంటర్‌టైనింగ్‌ చెప్పగలిగితే పెళ్లి చూపులుహిట్టయినట్టే. మరి.. దర్శకుడు ఏం చేశాడు. పెళ్లి చూపులంటూ.. ప్రాణం తీశాడా.. ? లేదా పెళ్లి చూపులు కొత్తగా ఉన్నాయ్ అనిపించాడా.. ? ఇంతకీ కథేంటీ.. ?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :

ఈతరం ఆలోచనలున్న కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). పెద్దగా లక్ష్యాలేమీ లేవన్నట్టు సరదాగా గడిపేస్తుంటాడు. కాకపోతే.. ఓ చెఫ్‌గా పనిచేయాలన్నది మనోడి కోరిక. అందరి ఇల్లలాగే..  ఇలా జీవితానికో లక్ష్యం లేకుండా తిరిగే కొడుక్కి పెళ్లిచేస్తే తిక్క కుదురితుంది. ఓ దారిలోకి వచ్చేస్తాడని ప్రశాంత్ తల్లిదండ్రులు ఫిక్సయిపోతారు. ఫాస్ట్ గా  చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్ళి నిశ్చయిస్తాడు కూడా. చిత్ర మాత్రం మనోడి టైప్ కాదు. ఓ లక్ష్యంతో పనిచేస్తోంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది ఆమె కల. అందుకే ప్రశాంత్ తో పెళ్లికి నో చెపేస్తోంది. ఈమె పోతో ఇంకో అమ్మాయి టైపులో.. ప్రశాంత్ కి పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఉద్యోగం, సద్యోగం లేని ప్రశాంత్ కి అమ్మాయి వాళ్ల తరుపు నుంచి సవాళ్లు ఎదురవుతూనే  ఉంటాయి. ఇలా ఓ వైపు పెళ్లి చూపుల ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. మరోవైపు చిత్రతో కలసి మనోడు ఫుడ్ ట్రక్ బిజినెస్మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరు ప్రయాణం ఏమలుపు తిరిగింది ? వీరి కథ చివరికి ఏ తీరం చేరింది.. ?? అనేది మిగితా కథ. సింపుల్ గా చెప్పాలంటే.. ఫస్ట్ పెళ్లి చూపులు చూసిన అమ్మాయి… కాలంతో పాటుగా అనేక మలుపులు అనంతరం పెళ్లి పీటలు ఎక్కిందా.. ? లేదా.. ?? అనేది స్టోరి.

ప్లస్ పాయింట్స్ :
* కథ
* డైరెక్షన్
* హీరో-హీరోయిన్
* కొత్తదనం
* ఫస్టాఫ్
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* సెకండాఫ్‌ స్లో-నేరేషన్
* ట్విస్టులు లేకపోవడం (కథ ముందే తెలిసిపోవడం)

పెర్ ఫామెన్స్ :
పెళ్లి చూపులుకి పెద్ద హీరో దర్శకుడు తరుణ్ భాస్కర్. రచయిత, దర్శకుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఈ తరం జనరేషన్ కి ఏం చెబితే ఎక్కుతుంది.. ఎట్లా చెబితే వర్కవుట్ అవుతుందో.. సరిగ్గా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశాడు. ఎక్కడా అతి గానీ, ఎక్కడా వెతీ గానీ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఆయన రాత-తీత రెండు బాగున్నాయి. సెకాండాఫ్ లో సినిమా కాస్త స్లో నేరేషన్ అనిపిస్తోంది. అదొక్కటే లేకుంటే పెళ్లి చూపులు స్థాయి మరోలా ఉండేది. దర్శకుడి తర్వాత సినిమాని నిలబెట్టింది కథానాయకుడు విజయ్ దేవర కొండ. ఈ తరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. విజయ్-రీతూ వర్మ కెమెస్ట్రీ తెరపై చాలా బాగుంది. ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ల మధ్య కెమెస్ట్రీ బాగా ఉపయోగపడింది. రీతూ వర్మ అందంగా సహజంగా నటించేసింది. ఇక మిగతా నటీనటులు కూడా బాగా నటించారు. ఒక్కటీ కూడా పనికిరాని పాత్ర అని అనిపించదు.

సాంకేతిక విభాగం :
 ‘పెళ్లి చూపులుసాంకేతికంగానూ రిచ్ గా ఉంది. తెరపై కొత్తదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ బడ్జెట్ చిత్రమే అయినా.. స్థాయి విజువల్స్ చాలా బాగొచ్చాయి. ఈ విషయంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ మూడు విభాగాల సమన్వయం అద్భుతంగా ఉంది. వివేక్ సాగర్ సంగీతం హాయిగా ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది. అన్ని విభాగాలూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాయి. ఈ తరం కుర్రాళ్లకి ఆలోచకి, ఆశలకి తగ్గట్టుగా ఈ సినిమా రిచ్ గా వచ్చింది. ఈ విషయంలో నిర్మాతలని మెచ్చుకోవాల్సింది.

చివరగా.. :
యూత్ ఫుల్ సినిమాని చూడ్డానికి ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త ఇబ్బంది పడుతుంటారు అనే టాక్ ఉంటుంది. కానీ.. పెళ్లి చూపులువిషయంలో అలాకాదు. ఇది యూత్ ఫుల్ ఫిల్మ్. అదేసమయంలో తల్లిదండ్రులతో కలసి ఏంచక్కా పెళ్లి చూపులు చూడొచ్చు. యువత ఆలోచనలను ఎలాఉంటాయని మాత్రమే చూపించారు. కానీ.. అదే పేరుతో అశ్లీలానికి ఏమాత్రం తావులేదు. కొత్తదనాన్ని కోరుకునే వారు తప్పకుండా  ‘పెళ్లి చూపులుథియేటర్స్ వైపు పరుగులు పెట్టొచ్చు.

బాటమ్ లైన్ : పెళ్లి చూపులు.. కొత్తగా ఉన్నాయ్.. !
రేటింగ్ : 3.25/5

—  vittu
– 9603632666

 

 

 

 

Leave a Reply