మిస్టర్…తెలుగుబులెట్ రివ్యూ

0
337
mister review

Posted [relativedate]

mister review

నిర్మాణ సంస్థ: ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్, నాజ‌ర్‌, నికిత‌న్ ధీర్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, పృథ్వీ, ఈశ్వ‌రీరావు, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: కె.వి.గుహ‌న్‌
కూర్పు: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
క‌ళ: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌
నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌, ఠాగూర్ మ‌ధు
ద‌ర్శ‌క‌త్వం: శ్రీనువైట్ల‌

ఎదగాలనుకునే ప్రయత్నంలో వున్న ఓ హీరో…ఎదిగి కిందకు పడ్డ ఓ దర్శకుడు కలిసి తీసిన సినిమా మిస్టర్.వరుణ్ తేజ్ కెరీర్ ఇంకా ప్రతి సినిమా నుంచి నేర్చుకునే దశలోనే వుంది.శ్రీను వైట్ల కెరీర్ ఉవ్వెత్తున ఎగసి కిందకు పడింది.తిరిగి నిలబడాలన్న ప్రయత్నంలో,తనను తాను రెండోసారి ప్రూవ్ చేసుకోడానికి తీసిన సినిమా మిస్టర్.అయితే మిస్టర్ నిజంగా హీరో,దర్శకుడు టార్గెట్ కి తగ్గట్టు ఉందో..లేదో ఇప్పుడు చూద్దాం..

కధ,కధనం….ఆంధ్ర,కర్ణాటక సరిహద్దుల్లో వున్న ఓ గ్రామం.ఆ గ్రామంలో పెత్తనం చేయాలంటే కర్రసాములో గెలవాలి.అలా గెలిచి ఊరిలో అందరికీ సాయం చేసే ఓ పెద్దాయన.ఆయనంటే పడని ఓ కుట్రదారు.ఆ గ్రామ సమీపంలో రంగురాళ్ళకోసం ఆ కుట్రదారుతో చేతులు కలిపిన విలన్. ఈ మొత్తం వ్యవహారంలో మంచివాడైన పెద్దాయన మనవడు,హీరో విదేశాల్లో ఉంటాడు.ఒకమ్మాయి అనుకుని ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి ఆమె ప్రేమలో పడతాడు.ఆమె కాదని వెళ్ళిపోయినా,ఆమెకి అవసరం అని తెలియగానే ఇండియా కి వచ్చేస్తాడు.ఇక్కడ హీరోకి ఇంకో అమ్మాయితో నిశ్చితార్ధం అవుతుంది.చివరకు హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఆ పెద్దాయన కి మనవడిగా వూరి సమస్యని ఎలా పరిష్కరించాడన్నదే మిస్టర్ సినిమా .

తెలుగుబుల్లెట్ విశ్లేషణ …పైన మనం చెప్పుకున్న కధ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిందే.అయితే కధనంలో కొత్తదనం వుంది కాబట్టే ఈ సినిమా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారని అనుకుందామంటే అదీ లేదు.మరి ఈ సినిమా ఎలా కుదిరింది అంటే కొన్ని ఎపిసోడ్స్ మీద ,శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయినట్టుంది.వాళ్ళు అనుకున్నట్టే ఫస్ట్ హాఫ్ సెట్ అయిపోయింది.సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి సినిమా గాడి తప్పింది.చాలా సందర్భాల్లో పాత సినిమా సీన్లు గుర్తుకు వచ్చాయి.

బలం ...హీరో వరుణ్ తేజ్ నిజంగా ఈ సినిమాకి బలమనే చెప్పుకోవాలి.ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే గ్లామర్ సహా ప్రతి విభాగంలో అతని ప్రతిభ మెరుగుపడింది.డైలాగ్స్,నటన..ఇలా అన్ని విభాగాల్లో వరుణ్ అంతకంతకీ ఇంప్రూవ్ అయ్యాడు.అయితే మెగా ఫ్యామిలీ కి బ్రాండ్ లాంటి డాన్స్ లో మాత్రం కుటుంబ గౌరవం నిలబెట్టాలంటే ఇంకాస్త కష్టపడాల్సిందే.ఇక వరుణ్ కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాతో బాగా ఇంప్రూవ్ అయ్యింది.ఇన్ని విధాలుగా వరుణ్ ని తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీను వైట్ల కధ,కధనం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటే వరుణ్ పడ్డ శ్రమకి ఫలితం దక్కేది.ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టే శ్రీను వైట్ల ఇంకొంచెం వైవిధ్యం వున్న కధ ఎంచుకుంటే బాగుండేది. తీసింది తీయడం వారికి అలవాటైనా..చూసిందే చూడడం ప్రేక్షకులకి కష్టమే. తనని ప్రూవ్ చేసుకునే ఇంకో అవకాశాన్ని శ్రీను వైట్ల యుటిలైజ్ చేసుకోలేదనే చెప్పుకోవాలి.బెటర్ లక్ నెక్స్ట్ టైం .

పంచ్ లైన్ …మిస్టర్ లో కొత్తదనం మిస్

రేటింగ్ …2 .5 /5 .

Leave a Reply