కాంగ్రెస్ బిల్లు పై టీడీపీ సంతకం ..

congress bill tdp sign

   మూలనపడ్డ ప్రత్యేక హోదా అంశం దుమ్ము దులిపిన కాంగ్రెస్ ఇప్పుడు అయ్యయ్యో అనుకుంటోందా ? అందుకు కారణాలు లేకపోలేదు. కేవీపీ ప్రైవేట్ బిల్లు వెనుక కాంగ్రెస్ పెద్ద ప్లాన్ వేసింది. ఒక్క దెబ్బకు రెండుపిట్టలు అన్నట్టు ఏకకాలంలో బీజేపీ,టీడీపీ కి చెక్ పెట్టొచ్చని భావించింది. వ్యవహారం చాలావరకు వారు అనుకున్నట్టే జరిగింది. కానీ బిల్లుకు మద్దతిస్తామన్న టీడీపీ ప్రకటనతో కాస్త కంగారు పడింది.

   కమలదళం ముందు ముఖ్యంగా.. మోడీ భయముండగా తెలుగుదేశం తెగించలేదని తనకు తానే కాంగ్రెస్ ధైర్యం చెప్పుకుంది. కానీ చర్చ మొదలయ్యాక సీన్ మారిపోయింది. జైట్లీ తో సుజనా వాదనకు దిగడంతో ఖంగుతింది. కథ అక్కడితో ఆగిపోలేదు. అప్పుడే మొదలయింది. కాంగ్రెస్ కేవలం వాక్ అవుట్ తో సరిపెడితే ..చర్చ అయిన కొద్దిసేపటికే చంద్రబాబు ప్రెస్ మీట్ మొదలయింది.

నిన్నమొన్నటి దాకా బీజేపీని ఉపేక్షించిన ఆయన వచ్చిన అవకాశాన్ని వాడుకొని కమలనాధుల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని బాబు పూర్తి స్థాయిలో వాడుకున్నారు. ఆంధ్ర ప్రజల ముందు కమలాన్ని దోషిగా నిలబెట్టడంతో పాటు తాను తెలివిగా కాంగ్రెస్ ఉచ్చునుంచి తప్పుకున్నారు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకుడు ఒకరు కాంగ్రెస్ బిల్లు తెస్తే టీడీపీ సంతకం పెట్టిందని వ్యాఖ్యానించారు. అంతే ..రాజకీయాల్లో వ్యూహం పన్నిన వారికే ఫలితం వస్తుందన్న గ్యారెంటీ లేదు.

ఏమి జరిగినా.. ఒకటే విమర్శా ?

kamineni srinivas

 రాజకీయాల్లో స్టాక్ డైలాగ్ లాగానే స్టాక్ విమర్శలుంటాయని మళ్లీ రుజువైంది. ప్రత్యేక హోదా అంశంలో అన్ని పార్టీల తీరు అదే.. కేవీపీ బిల్లుకు మద్దతిస్తూనే కాంగ్రెస్ కుట్రతోనే ఈ పనిచేసిందని బాబు విమర్శించారు. ఇక అయన మద్దతు తీసుకుంటూనే చంద్రబాబు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ అంటోంది. ఇక వైసీపీ దికూడా అదే ధోరణి. హోదా ఇవ్వాల్సిన కమలాన్ని వట్టి చేతితో.. పోరాటంలో కలిసొచ్చిన దేశాన్ని ఉంగరం చేతితో మొత్తింది.

     వీటన్నిటి కన్నా నవ్వొచ్చే విషయం ఒకటుంది. అదే ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శలు.. రాజ్యసభ వేదికగా కమలనాధులు చేసిన మోసం చూసి కూడా అయన పాతపాటే పాడారు. బీజేపీ, టీడీపీ ల మధ్య తగవు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అయన ఆరోపించారు. జరుగుతున్నదేమిటి ? ఆయన మాట్లాడేదేమిటి ? ఏమి చేద్దాం.. అంతా రాజకీయం..

నక్క తోక తొక్కిన కాజల్ .. చిరు తో చాన్స్

kajal selected chiru 150 movie కెరీర్ కష్టాల్లో ఉందనుకున్నప్పుడల్లా కాజల్ ని ఏదో రూపంలో అదృష్టం వరిస్తూనే వుంది.తెలుగులో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లేదనుకుంటుంటే ఏకంగా మెగా స్టార్ సినిమా వచ్చిపడింది.చిరు 150 వ చిత్రం కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చరణ్ ,వినయ్ జల్లెడ పట్టారు.అన్ని చోట్ల ఏదో సమస్య …డేట్లు కుదిరితే అమౌంట్ దగ్గర ..అది OK అనుకొంటే ఇంకో సమస్య..చివరికి నిర్మాత,డైరెక్టర్ లు కాజల్ దగ్గర ఫిక్స్ అయ్యారు.ఆమె కూడా వెంటనే ఓకే చెప్పింది.అందరి సమస్య తీరింది .ముఖ్యంగా కాజల్ నక్క తోక తొక్కింది..లేవు..లేవు..అనుకుంటూనే భలే ఛాన్స్ కొట్టేసింది.

అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

junior ntr meet cancer patient nagarjuna
టాలీవుడ్ హీరో జూనియ‌ర్‌ ఎన్టీఆర్. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. త‌న‌ను క‌ల‌వాల‌న్న ఓ క్యాన్స‌ర్ రోగిని ఎన్టీఆరే స్వ‌యంగా వెళ్లి క‌లిశారు. త‌న కోరిక నెర‌వేర‌డంతో కాన్స‌ర్ రోగి నాగార్జున ఆకాశ‌మంత ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

ఎన్టీఆర్‌ అభిమాని నాగార్జున బెంగ‌ళూరుకి చెందిన వ్య‌క్తి. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోన్న నాగార్జున‌కి ఎంతో కాలంగా ఎన్టీఆర్‌ను క‌ల‌వాల‌నే కోరిక ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ శనివారం బాధితుడిని తన ఇంటికి తీసుకెళ్లి మాట్లాడారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నాగార్జున సహా అతని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు.తన అభిమాన కథానాయకుడిని చూడగానే నాగార్జున కళ్లలో ఆనందం తొణికిసలాడింది. ఎన్టీఆర్‌ని చూడ‌గానే నాగార్జున ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. పెద‌విపై న‌వ్వులు చిందిస్తూ తార‌క్‌తో మాట్లాడాడు.

మోడీ కదిలారా..నిజమెంత?

modi amith sha chandra babu
దగాపడ్డ ఆంధ్రుల భావోద్వేగాల పొంగు మీద నీళ్లు చల్లే లీకేజీ బయటకు వచ్చింది. చంద్రబాబు ప్రకటనపై మోడీ దృష్టిపెట్టారని .. వెంటనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో ఈ అంశంపై చర్చించారని ఆ లీకేజీ సారాశం. పైగా త్వరలో బాబుని ఢిల్లీ పిలిపించి మాట్లాడతారని కూడా ఓ ఛానల్ స్క్రోలింగ్ వేసింది.అంతటితో ఆగకుండా టీడీపీ మీద విమర్శలొద్దని అమిత్ షా కమలం శ్రేణులకు ఆదేశమిచ్చారని కూడా చెప్పింది సదరు ఛానల్.

మరోవైపు సోమవారం నుంచి లోక్ సభ వేదికగా తెలుగుదేశం యుద్ధానికి సిద్ధం అవుతోంది.ఈ టైం లో వస్తున్న లీకుల్లో నిజమెంతో తేలాల్సివుంది .ఇంతకుముందు కూడా ఈ తరహా లీకులతో మోసపోయిన ఆంధ్రులు జరిగేదాకా ఏ విషయాన్ని నమ్మలేని పరిస్థితిలో వున్నారు.పార్లమెంట్ సాక్షిగా మోసాలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం అనుమానాలు ఉండటం సహజం.

తల్లికాంగ్రెస్ ..పిల్ల కాంగ్రెస్ కలుస్తాయా ?

congress and ysrcp
ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైసీపీ తలపెట్టిన బంద్ కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంతమాత్రానికే ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని అనడం తొందరపాటు. అలా అని జరుగుతున్న పరిణామాల్ని విస్మరించలేము. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి విభజన అంశాన్ని అయిందేదో అయిందన్నట్టు మాట్లాడారు. అసలు ఈ అంశానికి తెర తీసిన కాంగ్రెస్ ని పల్లెత్తు మాట అనలేదు.

ఇటీవలే కేవీపీ అల్లుడు జగన్ అంటూ చేసిన వ్యాఖ్యలు మన స్మృతిపధం నుంచి ఇంకా తొలగిపోలేదు.అంతకు ముందు ఉప్పు నిప్పులా వున్న రెండు పార్టీ ల నేతల టోన్ మారింది.అసలు జగన్ ని దగ్గరకు తీయడానికే కేవీపీని కాంగ్రెస్ ముందు నిలబెడుతోందన్న పుకార్లు హస్తినలో షికార్లు చేస్తున్నాయి.ఈ వార్తల్లో నిజానిజాలెలా వున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.అయితే ఏ రెండు జెండాలు పెనవేసుకుంటాయో ఇపుడే చెప్పలేం.

మహేష్ అక్కడ.. ఇక్కడ ఒక్కటే

mahesh muruga das movie titleఏదైనా ఒక సినిమాను వివిధ రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ఆయా భాషలను బట్టి సినిమా టైటిల్ వేరుగా వుంటుంది. ఓ రాష్ట్ర భాషలోనే క్యాచీగా ఉండేలా టైటిల్ నిర్ణయిస్తారు. అయితే, ఇప్పుడు మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో కామన్ టైటిల్ నిర్ణయించాలని అనుకుంటున్నారట.

రూ. 80 కోట్ల బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. అయితే, రెండు భాషలలోను వేర్వేరు టైటిళ్లు వుండడం కన్నా, కామన్ టైటిల్ గా ఒకటే ఉంటే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ మూవీలో మహేశ్ సరసన తొలిసారి రకుల్ జోడీ కడుతోంది.

పెళ్లిచూపులు క్లిక్… కొత్త పెళ్లి కొడుకు అభి

daggubati abhiram movie tarun bhaskar direction

దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ కథానాయకుడిగా త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇటీవలిగా వార్తలు వస్తున్నాయి. సీనియర్ వంశీ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నాడని అంతా అనుకున్నారు. అయితే అభిరామ్ మాటలు చూస్తే వంశీ డైరక్షన్‌లో అతడు చేయడంలేదని తెలుస్తోంది.

‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో తన మొదటి సినిమా ఉంటుందని అభిరామ్ లేటెస్ట్‌గా చెప్పాడు. తరుణ్ భాస్కర్ ఎప్పుడంటే అప్పుడు తన చిత్రం మొదలవుతుందని అన్నాడు. అభిరామ్ మాటలకు బలం చేకూరేలా ఇటీవలే తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ‘పెళ్లి చూపులు’ తరువాత సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పాడు. దీంతో అభిరామ్.. తరుణ్ భాస్కర్ సినిమాతోనే చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తాడని అంతా కన్ఫర్మేషన్‌కు వచ్చారు.

ఆ పాటలో తారక్ పక్కన కాజల్ ….

janatha garage item song kajal

‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఆ షెడ్యూల్ పూర్తైన తరువాత ఒక ఐటెమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాట తమన్నా చేయనున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. అయితే మిల్కీబ్యూటీకి బదులుగా కాజల్ ను తీసుకున్నట్టు లేటెస్ట్ న్యూస్.

రెండు హిందీ సినిమాల్లో ఛాన్స్ వచ్చే సూచనలు ఉండడంతో తమన్నా ఎన్టీఆర్ ఐటమ్‌ సాంగ్‌ను చేయలేనని చెప్పినట్లు సమాచారం. అనుకున్న టైమ్‌కే సినిమాను పూర్తిచేయాలన్న ధ్యేయంతో తమన్నా నో చెప్పిన వెంటనే ఆలోచించకుండా చిత్రబృందం కాజల్ ను సంప్రదించిందట. ఎన్టీఆర్ తో కలిసి ఐటెమ్ సాంగ్ చేయాలన్న ప్రపోజల్‌కు కాజల్ వెంటనే అంగీకరించిందని అంటున్నారు. అందుకు ఆమె అడిగిన పారితోషికం కూడా భారీగానే ఉందట.

విమానం వెతుకులాటలో US సాయం….

missing plane as 32

ఇటీవల గల్లంతైన ఏఎన్-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు భారత్ అమెరికా సాయాన్ని కోరింది. విమానానికి సంబంధించి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని..విమానం ఆచూకీ తెలుసుకునేందుకు యూఎస్ రక్షణశాఖ సాయాన్ని కోరామని కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం ఈ నెల 22న చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. విమానం కోసం ఇప్పటికే వైమానిక, తీర ప్రాంత రక్షణ దళాలు, నావికాదళాలు గాలింపు చర్యలు చేపట్టింది.

రాజ్యసభ to లోక్ సభ …సైకిల్ సవారీ

lok sabha rajya sabha tdp
రాజ్యసభలో ప్రత్యేకహోదా ప్రకంపనలు ఆగక ముందే తదనంతర రణక్షేత్రం ఖరారైంది.ఈ సారి లోక్ సభ వేదికగా హోదాపోరుకు దేశం రెడీ అయిపోయింది.ఇప్పటికే లోక్ సభలో నోటీసు ఇచ్చిన తెలుగుదేశం పోరాట వ్యూహం ఖరారు చేస్తోంది.అవసరమైతే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వద్దామని పార్టీ ముఖ్యులతో బాబు వ్యాఖ్యానించారట.

లోక్ సభలో దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశం చేశారు.పరిస్థితిని బట్టి లోక్ సభలోనే మంత్రుల రాజీనామా ప్రకటన చేయించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. మొత్తానికి రాజ్యసభ నుంచి లోక్ సభకు హోదా అంశం వస్తోంది .ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ కూడా కౌంటర్ వ్యూహం పై దృష్టి పెట్టింది.

ఆ ఉద్యోగాలకు 16 ఏళ్ళ వయసు

16-years

పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నాన్చుడు ధోరణి వల్ల ఉద్యోగాలు వచ్చేసరికి వయసు మీరిపోతోంది. దశాబ్దాల తరువాత వచ్చే ఉద్యోగాలకు వెళ్లలేని వారు కూడా పెరిగిపోతున్నారు. పిల్లల ఉద్యోగాల వేటలో ఉండాల్సిన తల్లిదండ్రులు కూడా తమ ఉద్యోగ అవకాశాలపై ఆశలు వదులుకోలేకపోతున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలు కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో 1999లో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించి 2000 సంవత్సరంలో పరీక్షల నిర్వహణ, అదే ఏడాది ఫలితాల వెల్లడి కూడా జరిగింది.  అయితే కోర్టు కేసులు, వాటిని పట్టించుకోవడంలో అప్పటి ఎపిపిఎస్‌సి పెద్దల నిర్లిప్తత వంటి కారణాలతో దాదాపు 16 ఏళ్లపాటు ఉద్యోగాల కల్పన జరగలేదు.

చివరకు అన్ని పరిష్కారం కావడంతో తాజాగా అర్హులైన వారికి ఏయే శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న జాబితాను విడుదల చేశారు. దీంతో అనేక మంది అభ్యర్ధుల్లో ఆనందం కనిపిస్తున్నప్పటికీ… మరికకొంతమందిలో నిర్లిప్తత చోటుచేసుకుంటోంది. వారిలో అనేక మంది ప్రస్తుతం ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్‌ అయిపోయారు. ఇప్పుడు ఎపిపిఎస్‌సి ప్రకటించిన శాఖల్లో ఉద్యోగాలకు వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదని, పైగా కొత్త అంశాలను మొదటి నుంచి నేర్చు కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కొత్త ఉద్యోగంలో సీనియార్టీకి అమలు చేస్తున్నప్పటికీ… ప్రస్తుతం చేస్తున్న ఉద్యో గాన్ని వదులుకునేందుకు వారు ఇష్టపడడంలేదని తెలుస్తోంది.

ఇటువంటి వారు సచివాలయంలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది సెక్షన్‌ అధికారుల స్థాయిలో, ఇంకొంతమంది అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయిల్లో కూడా ఉన్నారు. వారంతా ఎపిపిఎస్‌సి ఉద్యోగాలకు వెళ్లకూడదనే నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా, తాజాగా ప్రకటించిన జాబితా తప్పుల తడకగా ఉందన్న విమర్శలు వస్తు న్నాయి. ఒకే అభ్యర్ధికి రెండు ఉద్యోగాలు ఇస్తు న్నట్లు కూడా ఎపిపిఎస్‌సి ప్రకటనలో ఉందని అంటున్నారు. ప్రకటించిన జాబితాను ఆన్‌లైన్‌ నుంచి తొలిగించారు. త్వరలోనే తప్పును సరిదిద్ది మళ్లీ జాబితా ప్రకటించాలని భావిస్తున్నారు.

కాగా, జాబితాలో కీలక శాఖలకు ఎంపికైన వారు ఆ ఉద్యోగాల్లో చేరేరదుకు విముఖత చూపిస్తుండడంతో జాబితాలో దిగువన ఉన్నవారు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అనర్హులుగా మిగిలిన వారిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారు అర్హుల జాబితాలో స్థానం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పది వేల ఉద్యోగాలకు సంబంధించి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఎపిపిఎస్‌సి కస రత్తు ప్రారంభించింది. ముందుగా ఇంజనీర్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయిం చినట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి గిరిధర్‌ చెప్పారు. 

బాబు వల్లే బీజేపీ ఇవ్వలేదు..హోదాపై జగన్

jagan blames chandra babu
ప్రత్యేక హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత వై.ఎస్ .జగన్ అన్ని వర్గాల,పార్టీల మద్దతు కోరారు.రాజ్య సభ ఎపిసోడ్ విభజన నాటి పరిస్థితులనే తలపించిందన్నారు.అయితే ఈ వ్యవహారమంతటికీ చంద్రబాబు కారణమని అయన ఆరోపించారు.ప్రత్యేక హోదా సంజీవని కాదని బాబు అన్నాకే …బీజేపీ యూ టర్న్ తీసుకుందని జగన్ ధ్వజమెత్తారు.ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసే ధైర్యం చేయడం లేదని జగన్ అన్నారు.ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రి వర్గం నుంచి బయటకు రావడం బాబుకి ఇష్టం లేదని ఆయన చెప్పారు.

అటు బీజేపీ కూడా హోదా విషయంలో కుంటిసాకులు చెబుతోందని జగన్ విమర్శించారు.ప్రధాని నిర్ణయం తో వచ్చే హోదాకి ..ఆర్ధిక సంఘంతో ఏమి పని అని నిలదీశారు.ఏదీ అడగలేక చంద్రబాబు ఊరుకున్నా హోదాపై తమ పోరాటం ఆగదని అయన స్పష్టం చేశారు.బాబు వచ్చాక ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని జగన్ ముక్తాయించారు .

హరీష్ ఫోన్ ఆల్వేస్ ఎంగేజ్డ్…

harish-phone-always-engage

బిజీగా ఉన్నా తరువాత చేయండి.. అంటూ చాలామంది ఫోన్స్ కట్ చేస్తూ ఉంటారు! అందరూ చెప్పే రొటీన్ సాకు.. “బిజీగా ఉన్నాను” అనడం! అయితే తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు అలాకాదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా తిరిగి కాల్ చేస్తారట! ఈరోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎంతమంది ఉంటారు చెప్పండీ..? చాలా అరుదు కదా. అలాంటి జాబితాలో మంత్రి హరీష్ రావు పేరును చేర్చాల్సిందే.

ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజలకు ఫోన్ లో అందుబాటులో ఉంటున్నారట. రోజులో కొన్ని గంటలే అని కాకుండా.. రోజంతా అంటే 24 గంటలూ 365 రోజలూ ఆయన ఫోన్ లో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయే అనుకోండి… ఆ మీటింగ్ అయిన వెంటనే మిస్డ్ కాల్స్ చూసుకుని మరీ కాల్ బ్యాక్ చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారట.సొంత నియోజక వర్గం సిద్ధిపేట నుంచే కాదు – రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతీ రోజూ ఎన్నో కాల్స్ వస్తుంటాయని నాయకులు చెబుతున్నారు.

ఎన్ని ఫోన్లు వచ్చినా మంత్రి విసుగు లేకుండా మాట్లాడతారని అన్నారు. రోజువారీ వచ్చే కాల్స్ లో ఆరోగ్య సమస్యలకి సంబంధించినీ – ప్రభుత్వం తరఫున చికిత్స కోసం అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయని పార్టీ నేతలు వివరించారు. పోలీసు స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు – ఇతర ప్రభుత్వ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న తమ పనుల పరిస్థితుల గురించి ప్రజలు ఎక్కువగా హరీష్ తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలను కూడా హరీష్ సూచిస్తూ ఉంటారట.నిజానికి – ఇలా ఫోన్ లో ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది మంత్రి హరీష్ రావుకు కొత్తగా అలవడింది కాదు! తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఈ అలవాటు ఆయనకి ఉంది.

2000 సంవత్సరానికి ముందు నుంచే ఆయన ఫోన్ లో ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రారంభించారు. ఉద్యమ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. సో… ఇప్పుడు మంత్రిగా కూడా అదే అలవాటును కొనసాగించడం మెచ్చుకోదగ్గ విషయమే. ఫోన్ నంబర్లు బహిర్గతం చేసేందుకు భయపడుతున్న నాయకులున్న ఈ రోజుల్లో – మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా స్పందించే మంత్రి ఉండటం హర్షించదగ్గ విషయం. ఇతర నాయకులు కూడా హరీష్ ను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.

ముంబయిలో అవిభక్త కవలలు…

0

mumbai twins
అవిభక్త కవలలు అనగానే అందరికీ వీణా వాణి గుర్తొస్తారు. తాజాగా ఇలాంటి కేసే ముంబైలోని ఓ హాస్పిటల్ లోని డాక్టర్లకు ఎదురయ్యింది. అయితే ఇక్కడ మాత్రం ఆ ఇద్దరు కవలలకు తలలు తప్పించి శరీరంలోని అన్ని కీలకమైన అవయాలు కలిసి ఉన్నాయి. వీరిద్దరి పుట్టినప్పుడు 4.5 కేజీల బరువు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి కవలలు పుడతారని వారంటున్నారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టర్ల ప్రకారం వారిలో గుండె,మూత్రపిండాలు,లివర్ వేరు వేరుగా ఉన్నాయని.. కానీ ఊపిరితిత్తులు మాత్రం ఒక బిడ్డలోనే ఉందని వెల్లడించారు. ప్రతీ రెండు లక్షల జననాల్లో ఇలాంటి కేసు ఒకటి ఉంటుందని అలానే వారు బ్రతికే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు

కబాలికి 60 కోట్లు…

kabali 60 crores

రెండు మూడు వారాలుగా ఎవ‌రి నోట విన్నా క‌బాలి మాటే. క‌బాలి విడుద‌ల‌కు ముందు ఎంత‌గా మాట్లాడుకొన్నారో, క‌బాలికి నెగిటీవ్ టాక్ వ‌చ్చిన త‌ర‌వాత కూడా అంత‌కంటే ఎక్కువే మాట్లాడుకొన్నారు. ఫ్లాప్ టాక్ వ‌చ్చినా.. వ‌సూళ్ల ఉధృతి చూసి, అభిమానులు సైతం ముక్కుమీద వేలేసుకొన్నారు. అదీ… ర‌జ‌నీ స‌త్తా అంటూ కాల‌ర్లు ఎగ‌రేస్తున్నారు. తొలి మూడు రోజుల వ‌సూళ్ల‌లో గ‌త రికార్డుల‌న్నీ చెరిపేసింది క‌బాలి. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు డ్రాప్ అయ్యాయి గానీ, లేదంటే రూ.500 కోట్ల‌ను కొట్టేసేదే. బ‌య్య‌ర్ల మాట ఎలా ఉన్నా.. ఈ సినిమాతో మాత్రం నిర్మాత బాగానే సొమ్ము చేసుకొన్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

అయితే ఈ సినిమాకి ర‌జ‌నీ పారితోషికం ఎంత తీసుకొన్నాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ నెల‌కొంది. సౌతిండియాలోనే ర‌జ‌నీది అత్య‌ధిక పారితోషికం. ఈ విష‌యంలో ర‌జ‌నీకి కొట్టేవాడే లేడు. అయితే క‌బాలితో బాలీవుడ్ స్టార్స్‌ని సైతం దాటుకెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. సినిమా మొద‌లెట్ట‌క‌ముందే… ర‌జ‌నీకి రూ.50 కోట్లు ముట్టాయ‌ని, బిజినెస్ భారీ ఎత్తున జ‌రిగాక మ‌రో ప‌ది కోట్లు అందాయ‌ని మొత్తానికి రూ.60 కోట్ల రూపాయ‌ల్ని పారితోషికంగా తీసుకొన్నాడ‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. ర‌జ‌నీ ఆల్ ఇండియా రికార్డ్ కొట్టేసిన‌ట్టే.

ఆయుధాల అంగడి.. ఏకే 47 భలే చౌక

ak-47 cost less
స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఏకే 47 గన్ లభిస్తుంది. ఉగ్రవాద సంస్థలకు పుట్టినిల్లు అయిన పాకిస్థాన్‌లోని డర్రా అదమ్ ఖేల్ పట్టణం ఈ అక్రమ ఆయుధ మార్కెట్‌కు ప్రసిద్ధిగాంచింది. అంగట్లో కూరగాయలు పెట్టినట్టుగా.. అక్కడ ఆయుధాలను బహిరంగంగా పెట్టి విక్రయిస్తారు. చిన్న తుపాకీ మొదలు ఏకే 47 గన్స్ వరకు అన్ని రకాల ఆయుధాలను చాలా తక్కువగా విక్రయిస్తారు. పాక్ ప్రధాన నగరాల్లో ఒకటైన పెషావర్‌కు దక్షిణాన ఈ పట్టణం ఉన్నది. ఇక్కడ తుక్కు వస్తువులకు వెల్డింగ్ చేసి ఆయుధాలుగా తయారుచేసి విక్రయిస్తారు.

1980 దశకంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ముజాహిదీన్‌లు యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయుధాలు కొనుగోలు చేసేవారు. అనంతరం ఈ ప్రాంతం తాలిబన్లకు అడ్డాగా మారింది. ఇక్కడ వారు సమాంతర పాలన ప్రారంభించారు. ఎంపీ5 నకిలీ సబ్ మెషిన్‌గన్స్ తుపాకులు అమెరికా మార్కెట్‌లో సుమారు వెయ్యి డాలర్ల వరకు ఉంటే ఇక్కడ నకిలీవి రూ. 7 వేలకు లభిస్తాయి. ఇక్కడి ఆయుధ వ్యాపారులు ఏకే 47కు నకిలీలను 125 డాలర్లకు విక్రయిస్తారు. ఇక్కడ తుపాకుల తయారీ వర్క్‌షాప్‌లు కుటీర పరిశ్రమలను తలపిస్తాయి. వర్క్‌షాపులు, ఉద్యోగులు, జనరేటర్లు ఇక్కడ దర్శనమిస్తాయి.

వీరు కరాచీ షిప్‌యార్డులో ఆయుధాలకు సంబంధించిన లోహాన్ని అక్కడే తగిన ఆకారాల్లో మలుచుకొని మరీ తెచ్చుకుంటారు. తయారైన ఆయుధాలను వీధుల్లో పెట్టి కూరగాయల్లా విక్రయిస్తుంటారు. ఇక్కడ ప్రతిరెండు దుకాణాల్లో ఒకటి ఆయుధ విక్రయ దుకాణం

ఆ దెయ్యాల సంగతేంది? బాబు ఆందోళన

devil-fishes babu

కృష్ణా పుష్కరాలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఏపీ సర్కారుకు దెయ్యం చేపలు కొత్త తలనొప్పి తెస్తున్నాయి. ప్రచారంలో ఉన్నట్టు ఆ చేపలకు ముళ్ళుంటే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందోనని సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆ దెయ్యం చేపలవల్ల కలిగే ఇబ్బందులు, వాటిని నివారణ చర్యలపై ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పైగా ఆ చేపలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకోవాలని సూచించారు.

ఇపుడు ఈ నివేదికలు ఎలా తయారు చేయాలా అని అధికారులు తలలు పట్టుకొంటున్నారు. వీటిమీద అవగాహన వున్న మత్స్యకారుల్ని వెదికేపనిలో పడ్డారు.

సమైక్యాంధ్ర ముసుగులో వసూళ్లా..?

samaikyaadhra-criminals

ఉన్నత విద్యావంతులు, ఒకప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నాయకులు, సమైక్యాంధ్ర పార్టీ తరఫున ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసిన వ్యక్తులు  నేరగాళ్లుగా మారిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్ల నుంచి విజిలెన్స్‌ ప్రత్యేక అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు దిగారు. ఆరుగురు సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా ఆంటోని నగర్‌ పరిధి మహారాణిపేటకు చెందిన జొల్ల తారకరామారావు, సింగంపల్లి జగదీష్, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మరడాంకు చెందిన లగుడు గోవిందు(డాక్టరేట్‌ విద్యావంతుడు), విజయనగరంలోని వివేకానంద కాలనీకి చెందిన వర్రి హరీష్, ఏయూ విద్యార్థులు చల్లా నరేష్‌కుమార్, అట్టాడ అవినాష్‌లు బృందంగా ఏర్పడ్డారు. విజిలెన్స్‌ బృందం పేరుతో ఉత్తరాంధ్ర మూడుజిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు.

నిందితుడు రామారావు సమైక్యాంధ్ర తరఫున విశాఖపట్నం ఎంపీగా  2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా, మరో నిందితుడు గోవిందు ఇదే పార్టీ తరఫున విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం వీరు బ్లూ బుగ్గకారుతో ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. గత 14 రోజులుగా వసూళ్లను ముమ్మరం చేశారు. పాఠశాలలు సందర్శించడం, మరుగ దొడ్లు, మౌలిక వసతుల పరిశీలించడం, పాఠశాలలు బ్లాక్‌లిస్టులో పెట్టి గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించి బేరం కుదుర్చు కోవడం, డబ్బులు వసూలయ్యాక వెళ్లిపోవడం వీరి విధి. అయితే, కార్పొరేట్‌ పాఠశాలల జోలికి వెళ్లడంలేదు. చిన్న పాఠశాలు, గ్రామీణ ప్రాంత పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్నారు.

మూడు జిల్లాల్లో 54 పాఠశాలల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. ప్రస్తుతం పోలీసులు రూ. 50,300, ఇన్నోవా కారు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై జేఆర్‌ పురం పీఎస్‌ల రెండు, నరసన్నపేటలో మూడు, కోటబొమ్మాలిలో మూడు, టెక్కలిలో ఒక కేసు నమోదయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు. 

పోలవరం పై కుట్ర … ఉండవల్లి

undavalli-fire-cm-babu

ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామన్ని ఆయన అన్నారు. హోదా ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఏపీ ప్రజలపై ఎందుకింత కక్ష అని, ఏ తప్పు చేశామని ఉండవల్లి ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. పోలవరం పూర్తయితే 2వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, అవసరం అయితే ఒడిశాకు నీళ్లు అందించవచ్చన్నారు.